ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్ను తీసుకురానుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆఫీస్ పనికి సంబంధించిన రిమైండర్లు లేదా ముఖ్యమైన అప్డేట్లను ముందుగానే ప్లాన్ చేసుకునేలా 'షెడ్యూల్డ్ మెసేజెస్' ఫీచర్ను వాట్సాప్ పరీక్షిస్తోంది.