వాట్సాప్‌లో స్మార్ట్ టెక్స్ట్ యాక్షన్స్:

వాట్సాప్ కొత్తగా స్మార్ట్ టెక్స్ట్ యాక్షన్స్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. కాపీ, పేస్ట్ చేయకుండా చాట్‌లోనే పనులు పూర్తి చేసుకోవచ్చు.
ఏమేం గుర్తిస్తుంది?:
చాట్‌లోని ఫోన్ నంబర్లు, తేదీలు, సమయాలు, ఈమెయిల్ అడ్రస్‌లు, లొకేషన్లను ఈ ఫీచర్ గుర్తించి షార్ట్‌కట్లు చూపిస్తుంది.
చుక్కల అండర్‌లైన్ కనిపిస్తే:
ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో తాజా వెర్షన్ వాడేవారికి నంబర్లు, అడ్రస్‌లు, తేదీల కింద చుక్కల అండర్‌లైన్ కనిపిస్తుంది.
ట్యాప్ చేస్తే మెనూ:
హైలైట్ అయిన టెక్స్ట్‌పై ట్యాప్ చేస్తే షార్ట్‌కట్ ఆప్షన్లతో మెనూ తెరుచుకుంటుంది. అక్కడి నుంచే పని పూర్తి చేయవచ్చు.
ఫోన్ నంబర్‌పై ట్యాప్:
ఫోన్ నంబర్‌ను కాపీ చేయడం, కాంటాక్ట్స్‌లో సేవ్ చేయడం లేదా నేరుగా కాల్ చేయడం వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
తేదీ, సమయంపై ట్యాప్:
తేదీలు, సమయాలపై ట్యాప్ చేసి కాపీ చేయవచ్చు. క్యాలెండర్‌లో ఈవెంట్ యాడ్ చేయడం లేదా కొత్త ఈవెంట్ మొదలుపెట్టడం కూడా సాధ్యమే.
అడ్రస్‌కు మ్యాప్స్ షార్ట్‌కట్:
చాట్‌లో అడ్రస్ కనిపిస్తే దానిపై ట్యాప్ చేసి మ్యాప్స్‌లో ఓపెన్ చేయవచ్చు. దారి చూపించే డైరెక్షన్లు వెంటనే వస్తాయి.
ఈమెయిల్‌కు ఇన్‌స్టంట్ కంపోజ్:
ఈమెయిల్ అడ్రస్‌పై ట్యాప్ చేస్తే మీ డిఫాల్ట్ ఈమెయిల్ యాప్ తెరుచుకుంటుంది. అక్కడే వెంటనే మెయిల్ రాసి పంపవచ్చు.
పంపినా, వచ్చినా పనిచేస్తుంది:
స్నేహితులు పంపినా, మీరే టైప్ చేసినా ఈ ఫీచర్ పనిచేస్తుంది. అవసరం లేదనుకుంటే అండర్‌లైన్లను పట్టించుకోకుండా చాట్ చేయవచ్చు.
ఇంకా అందరికీ రాలేదు:
ఈ ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించలేదు. కొందరు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా వస్తోంది. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి అప్‌డేట్ చేసుకోండి.