మెయిన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయడం :

వాట్సాప్ ఓపెన్ చేసి పైన ఉన్న త్రీ డాట్స్ (More) > Settings > Storage & data పై క్లిక్ చేయాలి.
మేనేజ్ స్టోరేజ్ చూడటం :
Manage storage ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే వాట్సాప్ మీ ఫోన్‌లో ఎంత స్పేస్ వాడుతుందో పైన కనిపిస్తుంది.
నిర్దిష్ట చాట్ స్టోరేజ్ చెక్ చేయడం :
ఏదైనా ఒక చాట్ ఓపెన్ చేసి, ఆ కాంటాక్ట్ నేమ్‌పై టాప్ చేసి డైరెక్ట్ గా Manage Storage చూడవచ్చు.
పెద్ద ఫైళ్లను గుర్తించడం :
మేనేజ్ స్టోరేజ్ విభాగంలో ఫైళ్లు Largest to smallest ఆర్డర్‌లో కనిపిస్తాయి.
ఎక్కువగా ఫార్వర్డ్ అయినవి తీసివేయడం :
చాలామందికి ఫార్వర్డ్ చేసిన ఫైళ్లను మేనేజ్ స్టోరేజ్ విండోలో ఒక్కటిగా చూసి డిలీట్ చేయవచ్చు.
మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేయడం :
మీకు నచ్చని మీడియా ఫైళ్లపై లాంగ్ ప్రెస్ చేసి ఒక్కోటిగా లేదా Select All కొట్టి ఒకేసారి ఎంచుకోవచ్చు.
పర్మనెంట్ డిలీట్ ఆప్షన్ :
ఫైళ్లను సెలెక్ట్ చేసిన తర్వాత డస్ట్ బిన్/డిలీట్ ఐకాన్ పై టాప్ చేస్తే మీ వాట్సాప్ మీడియా నుంచి అవి శాశ్వతంగా తొలగిపోతాయి.
చాట్ గ్యాలరీ ప్రభావం :
వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఫైల్స్ మీ ఫోన్ మెమరీలో ముందే సేవ్‌ అయి ఉంటే, అక్కడి నుంచి కూడా మాన్యువల్‌గా డిలీట్ చేయాల్సి ఉంటుంది.
సర్చ్ ఫీచర్ ఉపయోగించడం :
చాట్ లిస్ట్ పైన ఉన్న Search బార్ ఉపయోగించి డైరెక్ట్‌గా ఫొటోలు, వీడియోలు లేదా డాక్యుమెంట్లను వెతకవచ్చు.
సర్చ్ ఫలితాల నుంచి డిలీట్ చేయడం :
సర్చ్‌లో కనిపించిన ఫైల్‌ను ఓపెన్ చేసి, నేరుగా అక్కడికక్కడే డిలీట్ ఆప్షన్ ఉపయోగించి తొలగించవచ్చు.