వేసవిలో కాఫీ తాగాలా? టీ తాగాలా ?

సమ్మర్ వచ్చిందంటే చాలా మంది కాఫీ, టీ తాగాలంటే జంకుతున్నారు. కానీ తాగకుండా ఉండలేకపోతారు.
వేసవిలో కాఫీ తాగాలా, టీ తాగాలా.. ఈరెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.
కొన్ని అధ్యయనాల ప్రకారం వేడి పానీయాలు కూడా మిమ్మల్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయని సూచించాయి.
వేసవిలో కూడా మీరు ఉత్సాహంగా ఉండాలంటే ఒకటి లేదా రెండు సార్లు కాఫీ కానీ టీ కానీ తాగవచ్చు.
వేడి టీ తాగిన త్వాత చెమటలు వస్తాయి. అనంతరం మీరు చల్లబడుతారు.
వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ టీ మిమ్మల్ని హైడ్రేటేడ్ గా ఉంచేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా చక్కెర సోడాలు లేదా పండ్ల రసాలతో పోల్చితే.
టీలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది వేసవిలో కూడా ఆరోగ్యకరమైన ఎంపిక
సమ్మర్ లోనూ టీ కానీ కాఫీ కానీ తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కానీ మోతాదుకు మించి తాగకూడదు.