కనిపించే ఫిట్‌నెస్ వేరు.. గుండె ఆరోగ్యం వేరు:

బయటికి సన్నగా, బలంగా కనిపించినంత మాత్రాన గుండె లోపల ఆరోగ్యంగా ఉందని చెప్పలేం.
సైలెంట్ ఇన్‌ఫ్లమేషన్:
రక్త నాళాల్లో కలిగే నిశ్శబ్ద వాపు ఏళ్ల తరబడి ధమనులను దెబ్బతీస్తుంది. ఇది సాధారణ పరీక్షల్లో కూడా బయటపడదు.
ఒత్తిడి :
సుదీర్ఘ పని గంటలు, మానసిక ఒత్తిడి వల్ల పెరిగే స్ట్రెస్ హార్మోన్లు హఠాత్తుగా గుండెపోటుకు దారితీస్తాయి.
నిద్ర లేమి:
రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండె బలహీనపడుతుంది.
జన్యుపరమైన కారణాలు :
కుటుంబంలో గుండె సమస్యల చరిత్ర ఉంటే, మీరు ఎంత ఫిట్‌గా ఉన్నా ప్రమాదం పొంచి ఉన్నట్లే.
అతిగా వ్యాయామం:
శరీర సామర్థ్యానికి మించి వర్కవుట్స్ చేయడం, స్టెరాయిడ్స్ వాడటం గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
తప్పుడు ఆహారపు అలవాట్లు:
అతిగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.
ధూమపానం & మద్యం:
ఎక్సర్‌సైజ్ చేస్తున్నా సరే.. సిగరెట్, మద్యం అలవాట్లు ఉంటే అవి ధమనులను గట్టిపడేలా చేస్తాయి.
నిర్లక్ష్యం చేయకూడని సంకేతాలు:
ఛాతీ పట్టేయడం, దవడ నొప్పి, విపరీతమైన చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి.
ముందస్తు జాగ్రత్తలు:
క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవడం, యోగా, మెడిటేషన్ ద్వారా గుండెను కాపాడుకోవచ్చు.