జీవ గడియారానికి సిగ్నల్

ఉదయాన్నే బయటకు వచ్చి నడవడం వల్ల రోజు ప్రారంభమైందని మన శరీరానికి, మెదడుకు స్పష్టమైన సంకేతాలు అందుతాయి. ఇది మన అంతర్గత జీవ గడియారాన్ని యాక్టివేట్ చేస్తుంది.
మెలటోనిన్ హార్మోన్‌కు చెక్
ఉదయపు ప్రకాశవంతమైన సూర్యకాంతి మన కళ్లపై పడగానే.. ఒంట్లో అలసటను కలిగించే 'మెలటోనిన్' అనే హార్మోన్ ఉత్పత్తి వెంటనే తగ్గిపోతుంది. దీనివల్ల మనం నిద్రమత్తు వదిలి వెంటనే మేల్కొంటాం.
రోజంతా ఉల్లాసం
మెలటోనిన్ హార్మోన్ తగ్గడం వల్ల శరీరం, మనస్సు రీఛార్జ్ అవుతాయి. ఉదయం నుంచే ఒక రకమైన సరికొత్త ఉత్సాహం, చురుకుదనం మన సొంతమవుతాయి.
రాత్రి నిద్రకు సూపర్ ప్లాన్
పగటి వెలుతురు మన జీవ గడియారాన్ని వేగవంతం చేస్తుంది. దీనివల్ల రాత్రి వేళ మీరు పడుకోవాలనుకున్నప్పుడు మీ శరీరం ఆటోమేటిక్‌గా సుఖ నిద్రకు పూర్తిగా సిద్ధంగా ఉంటుంది.
ఇన్సోమ్నియాకు గుడ్ బై
మీకు రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే.. దానికి కారణం ఉదయం వేళల్లో మీరు ప్రకాశవంతమైన ఎండలో తగినంత సమయం గడపకపోవడమే కావచ్చునని పరిశోధనలు చెబుతున్నాయి.
మూడ్ బూస్టర్ సెరటోనిన్
ఉదయపు సహజ కాంతి మన శరీరం నుంచి సెరటోనిన్ అనే రసాయనాన్ని విడుదలయ్యేలా చేస్తుంది. ఇది మన మానసిక స్థితిని అద్భుతంగా మెరుగుపరిచే సహజ బూస్టర్.
అడుగుల సంఖ్య కంటే వేగమే ముఖ్యం
అల్స్టర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మేరీ మర్ఫీ పరిశోధన ప్రకారం.. ఒక రోజులో మనం ఎన్ని అడుగులు నడిచామనే దానికంటే, ఎంత వేగంగా నడిచామనేదే ఆరోగ్యానికి అత్యంత ప్రధానం.
గుండె జబ్బుల ముప్పుకు బ్రేక్
50 వేల మందిపై చేసిన అధ్యయనంలో.. వేగంగా నడవడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బుల ప్రమాదం 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతుందని తేలింది.
క్యాన్సర్ మరణాల నియంత్రణ
రోజువారీ సాధారణ నడక క్యాన్సర్ మరణాల ముప్పును అదుపులో ఉంచితే.. అదే నడకలో కాస్త వేగాన్ని పెంచడం వల్ల గుండెకు డబుల్ ప్రొటెక్షన్ లభిస్తుందని సైంటిస్టులు నిరూపించారు.
రోజుకు 30 నిమిషాల ఫార్ములా
ప్రస్తుత ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాలైనా వేగంగా నడవాలి. మిగతా వ్యాయామాల కంటే నడక భిన్నమైంది కాబట్టి, అలసిపోకుండా రోజులో ఎన్నిసార్లయినా దీనిని చేయవచ్చు.