ఒకప్పటి క్రేజీ ఫీచర్:

గతంలో ప్రతి బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో FM రేడియో తప్పనిసరి ఫీచర్‌గా ఉండేది.
ఉచిత వినోదం:
ఇంటర్నెట్ డేటాతో పనిలేకుండా, ఇయర్ ఫోన్స్ ప్లగ్-ఇన్ చేసి ఉచితంగా లోకల్ ఎఫ్‌ఎమ్‌ స్టేషన్లు వినే అవకాశం ఉండేది.
యాంటెన్నాగా వైర్డ్ ఇయర్ ఫోన్స్:
వైర్డ్ ఇయర్ ఫోన్‌లోని వైర్ యాంటెన్నాగా పనిచేసేది, అందువల్ల నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లోనూ ఎఫ్‌ఎమ్‌ బాగా పనిచేసేది.
నెక్స్ట్ రేడియో ప్రయత్నం:
2013లో ఎమిస్ కమ్యూనికేషన్స్ అనే సంస్థ నెక్స్ట్ రేడియో యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్లలో FMని విస్తరించాలని చూసింది.
దిగ్గజ కంపెనీలతో టైఅప్:
ఎస్‌ప్రింట్, ఎల్‌జీ, శామ్‌సంగ్ వంటి కంపెనీలతో నెక్స్ట్ రేడియో ఒప్పందాలు చేసుకున్నా, ఆ ప్రయత్నం ఎక్కువ కాలం సాగలేదు.
డిమాండ్ తగ్గడమే కారణం:
వినియోగదారుల నుంచి ఈ ఫీచర్‌కు ఆశించిన స్థాయిలో డిమాండ్ లేదని మొబైల్ ఆపరేటర్లు, తయారీదారులు భావించారు.
స్ట్రీమింగ్ యాప్‌ల విప్లవం:
యూట్యూబ్, స్పాటిఫై, ఇతర ఆడియో స్ట్రీమింగ్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఎఫ్‌ఎమ్ ప్రాధాన్యత తగ్గడం ప్రారంభమైంది.
4G, 5G నెట్‌వర్క్‌ల ప్రభావం:
హై-స్పీడ్ 4G, 5G డేటా అందుబాటులోకి రావడంతో ప్రజలు నచ్చిన పాటలు, పాడ్‌కాస్ట్‌లను కోరుకున్న సమయంలో వినడానికి అలవాటుపడ్డారు.
హెడ్‌ఫోన్ జాక్ తొలగింపు:
ఆధునిక స్మార్ట్‌ఫోన్ల నుంచి 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను తొలగించడం కూడా FM రేడియో మాయమవడానికి ఒక కారణం.
యూజర్ ప్రాధాన్యతల్లో మార్పు:
వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, వైర్‌లెస్ ఆడియోపైనే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ప్రస్తుతం దృష్టి సారిస్తున్నాయి.