ఎందుకు ఎక్కువ చలి

ఒకే వాతావరణంలో ఉన్నా కొందరికే చలి ఎక్కువగా అనిపిస్తుంది. దీని వెనుక ఉన్న 4 ప్రధాన కారణాలు ఇవే.
ఐరన్, B12 లోపం
ఐరన్, విటమిన్ B12 లోపం వల్ల శరీరంలో తగినంత ఆక్సిజన్ రవాణా జరగదు.
వేడి ఉత్పత్తి తగ్గుతుంది
ఆక్సిజన్ రవాణా తగ్గితే వేడి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దీంతో చేతులు, కాళ్లు చల్లబడతాయి.
థైరాయిడ్ గ్రంథి సమస్య
థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే చలి ఎక్కువగా అనిపిస్తుంది.
జీవక్రియ నెమ్మదిస్తుంది
థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే జీవక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా చలి ఎక్కువవుతుంది.
కొవ్వు, కండరాలు తక్కువైతే
శరీరంలో కొవ్వు లేదా కండరాలు తక్కువగా ఉంటే వేడిని నిలుపుకోవడం కష్టమవుతుంది.
మగవారితో పోలిస్తే
మగవారితో పోలిస్తే ఆడవారు ఎక్కువగా చలి ఫీల్ అవుతారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.
జీవక్రియ రేటు తక్కువ
ఆడవారిలో జీవక్రియ రేటు తక్కువగా ఉండటం వల్ల వారు ఎక్కువగా చలి ఫీల్ అవుతారు.
కండరాల పరిమాణం తక్కువ
ఆడవారిలో కండరాల పరిమాణం తక్కువగా ఉండటం కూడా చలి ఎక్కువగా అనిపించడానికి కారణమని చెబుతున్నారు.
4 కారణాలు గుర్తుంచుకోండి
ఐరన్, B12 లోపం, థైరాయిడ్ సమస్య, కొవ్వు లేదా కండరాలు తక్కువగా ఉండటం, ఆడవారిలో జీవక్రియ.. ఇవే చలికి ప్రధాన కారణాలు.