యూట్యూబ్ స్టార్ అవ్వాలనుకుంటున్నారా? సక్సెస్ కోసం పాటించాల్సిన గోల్డెన్ టిప్స్ ఇవే
YPP నిబంధనలు పూర్తి చేయండి
మీ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే కనీసం 1,000 మంది సబ్స్క్రైబర్లు, గత ఏడాదిలో 4,000 గంటల వాచ్ టైమ్ (లేదా షార్ట్స్ ద్వారా 90 రోజుల్లో 1 కోటి వ్యూస్) ఉండాలి.
క్రమం తప్పకుండా వీడియోలు
వారానికి కనీసం 2 నుంచి 3 వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా ఛానల్ ట్రాఫిక్ పెరిగి, యూట్యూబ్ అల్గారిథమ్ మీ వీడియోలను ఎక్కువ మందికి చూపిస్తుంది.
ట్రెండింగ్ కంటెంట్, క్వాలిటీ
ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను ఎంచుకోండి. అలాగే ఆడియో స్పష్టంగా ఉండేలా, ఎడిటింగ్ నీట్‌గా ఉండేలా చూసుకుంటే ప్రేక్షకులు మీ వీడియోలకు కనెక్ట్ అవుతారు.
SEO పై దృష్టి పెట్టండి
మీ వీడియో టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్‌లో సరైన కీవర్డ్స్ వాడండి. దీనివల్ల ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో మొదటి వరుసలో కనిపిస్తుంది.
ఆదాయ మార్గాలు పెంచుకోండి
కేవలం యాడ్స్ మాత్రమే కాకుండా.. సూపర్ చాట్, ఛానెల్ మెంబర్‌షిప్స్, బ్రాండ్ కొలాబరేషన్స్ ద్వారా కూడా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.