AI-సపోర్టెడ్ కంటెంట్:

యూట్యూబ్ క్రియేటర్ల కోసం వీడియో తయారీ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతి దశలోనూ ఏఐ సహాయం లభించనుంది.
యూట్యూబ్ స్టూడియో అప్‌డేట్స్:
కొత్త ఇన్‌సైట్స్, రీసెర్చ్ సెక్షన్ ద్వారా క్రియేటర్లు తమ పాత వీడియోల పనితీరును విశ్లేషించుకోవచ్చు.
స్మార్ట్ థంబ్‌నెయిల్స్:
ఛానల్ స్టైల్‌కు తగినట్లుగా థంబ్‌నెయిల్‌లను తయారు చేసుకోవడంతో పాటు, డైనమిక్ థంబ్‌నెయిల్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి.
జెమిని ఆధారిత ఎడిటింగ్:
షార్ట్స్, యూట్యూబ్ క్రియేట్‌లో జెమిని అసిస్టెంట్ సాయంతో క్లిప్‌లను కట్ చేయడం, మ్యూజిక్ సింక్ చేయడం సులభమవుతుంది.
కామెంట్ మాడరేషన్:
క్రియేటర్ల నైతికతకు తగినట్లుగా కామెంట్లను నియంత్రించే ఆప్షన్‌ను యూట్యూబ్ టెస్ట్ చేస్తోంది.
లైక్‌నెస్ డిటెక్షన్:
క్రియేటర్ల భద్రత కోసం ఫేషియల్ డిటెక్షన్‌తో పాటు స్పీకింగ్ వాయిస్ డిటెక్షన్‌ను జోడించనున్నారు.
'ఆస్క్ యూట్యూబ్' షాపింగ్:
వీడియో చూస్తున్నప్పుడు యూజర్లు ప్రొడక్ట్స్ గురించి నేరుగా ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రొడక్ట్ కంపెరిజన్:
యూజర్లు కోరినట్లయితే ప్రొడక్ట్స్‌కు సంబంధించిన కంపెరిజన్ టేబుల్స్ స్క్రీన్ పై కనిపిస్తాయి.
భారత్‌లో షాపింగ్ ప్రోగ్రామ్ విస్తరణ:
అమెజాన్‌తో పాటు అజియో, మీషో, స్నాప్‌డీల్, టాటా క్లిక్ వంటి సంస్థలు యూట్యూబ్ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో చేరాయి.
పెరుగుతున్న క్రియేటర్ల ఆదాయం:
50 శాతానికి పైగా క్రియేటర్లు ఈ ప్రోగ్రామ్‌ను వాడుతుండగా, వారి పేఅవుట్లు గణనీయంగా పెరుగుతున్నాయి.