Viral Video: ప‌ట్టాలు త‌ప్పిన రైలు ట్ర‌క్కును వేగంగా ఢీకొట్టింది..! షాకింగ్ వీడియో

Viral Video: ప‌ట్టాలు త‌ప్పిన రైలు ట్ర‌క్కును వేగంగా ఢీకొట్టింది..! షాకింగ్ వీడియో
x

Viral Video: ప‌ట్టాలు త‌ప్పిన రైలు ట్ర‌క్కును వేగంగా ఢీకొట్టింది..! షాకింగ్ వీడియో

Highlights

Viral Video: సోషల్ మీడియాలో ప్ర‌తిరోజు చాలా వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి.

Viral Video: సోషల్ మీడియాలో ప్ర‌తిరోజు చాలా వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. నెటిజ‌న్లు ఈ వీడియోల‌ను చాలా ఇష్ట‌ప‌డుతారు. ప‌దే ప‌దే చూస్తూ లైక్స్, కామెంట్స్ చేస్తారు. తాజాగా ఓ రైలు , ట్ర‌క్కును ఢీకొన్న ఒక వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ వీడియోను నెటిజ‌న్లు ఉత్కంఠ‌గా చూస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఆ వీడియో విశేషాల‌ను తెలుసుకుందాం.

ఈ సంఘటన శుక్రవారం అమెరికాలోని ఓక్లహోమాలోని థాకర్‌విల్లేలో జరిగింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీడియోలో రైలు ప‌ట్టాల‌పై అధిక లోడ్ కార‌ణంగా ట్ర‌క్కు ఆగిపోవ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో వేగంగా వ‌స్తున్న రైలు అనుకోకుండా ప‌ట్టాలు త‌ప్పింది. దీంతో అదే వేగంతో వ‌చ్చి ట్ర‌క్కును బ‌లంగా ఢీ కొట్టడం మ‌నం వీడియోలో చూడ‌వ‌చ్చు. ఈ దృశ్యం చూస్తే ఒక్కొక్క‌రి ఫ్యూజులు ఔట‌వుతున్నాయి. నెటిజ‌న్లు ఈ వీడియోను చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ప్ర‌మాదానికి సంబంధించిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. మీరు లవ్ కౌంటీ ఫైర్‌ఫైటర్స్ (ఫైర్ డిపార్ట్‌మెంట్ లవ్ కౌంటీ) పేజీలో ఈ చిత్రాలను చూడవచ్చు. సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత రైల్వే అదికారులు సంగఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని జ‌రిగిన న‌ష్టం గురించి అంచ‌నా వేశారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజ‌న్ ఇలా చెప్పాడు. 'చాలా ప్ర‌మాకద‌క‌ర‌మైన వీడియో' అన్నాడు. మ‌రొక‌రు 'స‌మ‌యానికి అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డం మంచిదైంద‌న్నారు' కొన్ని ప్ర‌మాదాల‌ను ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని చాలామంది వ్యాఖ్యానించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories