Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ చెట్లు నాటండి.. డబ్బుకి లోటుండదు..!

Vastu Tips Plant These Trees Near The Main Entrance of the House
x

Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ చెట్లు నాటండి.. డబ్బుకి లోటుండదు..!

Highlights

Vastu Tips: ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడం వల్ల చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతారు.

Vastu Tips: ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడం వల్ల చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతారు. అలాగే ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం కూడా బాగుంటుందంటారు. ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన చెట్లు, మొక్కలు నాటడం ద్వారా పాజిటివ్‌ శక్తి పెరుగుతుంది. ఇంటి అందాన్ని పెంచేందుకు ఎన్నో చెట్లు, మొక్కలు నాటుతుంటారు కానీ ఈ చెట్లు, మొక్కలు మెయిన్ డోర్ కు సరైనవో కాదో తెలియదు. చాలా సార్లు మీరు నాటిన చెట్లు, మొక్కలు మంచి ఫలితాలను ఇవ్వవు. ఎందుకంటే వాటిలో కూడా వాస్తు దోషాలు ఉంటాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీరు ప్రధాన ద్వారం వద్ద ఏ చెట్లను, మొక్కలను నాటాలో తెలుసుకుందాం.

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ ఇంటి లోపల లేదా ఇంటి వెలుపల ఉంచినా ఇది ఎల్లప్పుడూ ఆనందాన్ని పెంచుతుంది. ప్లాంట్ తీగను ప్రధాన ద్వారంపై ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.

తులసి మొక్క

మతపరమైన దృక్కోణం నుంచి తులసి మొక్క ముఖ్యమైనదిగా చెబుతారు. వాస్తు ప్రకారం తులసి పాజిటివ్‌ శక్తిని పెంచుతుంది. కాబట్టి ఈ మొక్కను ప్రధాన ద్వారం వద్ద నాటాలి. దీంతో ఆ ఇల్లు సంపదతో నిండి ఉంటుంది.

మల్లె చెట్టు

మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతుంది. ఇది చాలా అదృష్టమని, పాజిటివ్‌ శక్తిని కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

నిమ్మ లేదా ఆరెంజ్ చెట్టు

నిమ్మ చెట్టు లేదా నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది. ఇవి అదృష్టాన్ని పెంచుతాయి. మీరు వీటిని ప్రధాన తలుపు ముందు కాకుండా కుడి వైపున నాటాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories