David Warner: పఠాన్‌గా మారిపోయిన డేవిడ్‌ వార్నర్‌.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందేనని..

David Warner Becomes Shah Rukh Khan From Pathaan
x

David Warner: పఠాన్‌గా మారిపోయిన డేవిడ్‌ వార్నర్‌.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందేనని..

Highlights

David Warner: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్... పఠాన్‌లా మారిపోయాడు.

David Warner: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్... పఠాన్‌లా మారిపోయాడు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రం ఇటీవల విడుదల కాగా... ఈ చిత్రానికి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో షారుక్ ఫేస్ ప్లేస్‌లో వార్నర్ తన ఫొటోను రీప్లేస్ చేసి ఇన్ స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశాడు. దీనికి 'వావ్ వాట్ ఏ ఫిల్మ్.. ఈ సినిమాకు పేరు పెట్టగలమా..? ' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు 'డేవిడ్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories