IPL 2021: మ‌రో షాక్..దూరం కానున్న కీల‌క ఆట‌గాళ్లు

New Zealand  Cricketers Could Miss Rescheduled IPL 2021
x
Warner & Bairstow (file image)
Highlights

IPL 2021: ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్థాంత‌రంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే

IPL 2021: ఈ ఏడాది ఐపీఎల్-14కి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్థాంత‌రంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక లీగ్ మ‌ధ్య‌లోనే కొంద‌రూ ఆసీస్ ఆట‌గాళ్లు దూరం అయ్యారు. క‌రోనాకు భ‌య‌ప‌డి కొంద‌రూ టోర్నీ ప్రారంభానికి ముందే పాల్గొనేది లేద‌ని తేల్చి చెప్పారు.తీరా టోర్నీ ఆరంభం కాగానే.. మిగ‌తా ఆట‌గాళ్లు స‌గం మ్యాచులు పూర్తి కాగానే టోర్నీ ర‌ద్ద‌యింది. ఇప్ప‌టికే బీజీ షెడ్డుల్ కార‌ణంగా ఇంగ్లండ్‌ క్రికెటర్లు అందుబాటులో ఉండరని ఆ దేశ క్రికెట్ బోర్డు ఈసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌ విండోలో నిర్వహిస్తామని బీసీసీఐకి చెబుతున్నా అదంత సులువు కాద‌ని స్ప‌ష్టమ‌వుతుంది. ఐపీఎల్‌లో సెప్టెంబర్‌లో నిర్వహిస్తే న్యూజిలాండ్ ఆట‌గాళ్ళు కూడా ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్‌ నెలలో యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్‌ పాల్గొనాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని బ్లాక్ క్యాప్స్ జట్టు ఈ సిరీస్‌ను సీరియస్‌గా తీసుకోవాలని భావిస్తుంది. దీంతో కెప్టెన్‌ విలియమ్సన్‌, బౌల్ట్‌, బెయిస్ట్రో, సహా తదితర ఆటగాళ్లంతా ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇంగ్లాండ్, కివీస్, ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు దూరం కావ‌డంతొ లీగ్‌ కళ తప్పడంతో విదే ఫ్రాంచైజీలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. యితే సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌ విండోలో నిర్వహిస్తామని బీసీసీఐకి చెబుతున్నా అది అంత సులువు కాదని తెలుస్తోంది. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా వారంద‌రూ దూరమైతే కోట్లు గుమ్మరించి మరీ కొనుగోలు చేస్తాయి ఆయా ఫ్రాంచైజీలు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories