WPL 2026 : హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే ఆ నలుగురికి ఎక్కువ జీతం.. నంబర్ 1 ఎవరో తెలుసా?

WPL 2026  : హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే ఆ నలుగురికి ఎక్కువ జీతం.. నంబర్ 1 ఎవరో తెలుసా?
x

WPL 2026 : హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే ఆ నలుగురికి ఎక్కువ జీతం.. నంబర్ 1 ఎవరో తెలుసా?

Highlights

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. ఐదు జట్లు కలిసి మొత్తం 17 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి.

WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. ఐదు జట్లు కలిసి మొత్తం 17 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ఈ రిటెన్షన్‌ జాబితాలో, ఏ ఆటగాడికి ఎంత జీతం దక్కనుందో ఇప్పుడు వెల్లడైంది. ఆశ్చర్యకరంగా, మహిళల ప్రపంచకప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే నలుగురు విదేశీ ఆటగాళ్లకు ఎక్కువ జీతం దక్కనుంది. రిటైన్ అయిన ఈ 17 మంది ఆటగాళ్ల జీతం వివరాలు, అత్యధిక మొత్తం దక్కించుకున్న టాప్ ప్లేయర్‌ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

డబ్ల్యూపీఎల్ 2026 రిటెన్షన్స్‌లో అత్యధిక జీతం దక్కించుకున్న ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. వీరందరికీ ఒక సీజన్‌కు రూ.3.5 కోట్లు లభించనుంది. ఆర్సీబీకి చెందిన స్మృతి మంధానకు రూ.3.5 కోట్లు, ముంబై ఇండియన్స్‎కు చెందిన నట్ సైవర్-బ్రంట్‎కు 3.5 కోట్లు, గుజరాత్ జెయింట్స్కు చెందిన యాష్లీ గార్డ్‌నర్ రూ.3.5 కోట్లు. ప్రపంచకప్ అందించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జీతం కంటే నలుగురు ఆటగాళ్ల జీతం ఎక్కువ ఉంది.

ముంబై ఇండియన్స్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను రూ.2.5 కోట్లకు రిటైన్ చేసింది. ఎంఐ అట్టిపెట్టుకున్న ఇతర ఆటగాళ్లలో హీలీ మాథ్యూస్ (రూ.1.75 కోట్లు), అమన్‌జోత్ కౌర్ (రూ.కోటి), జి. కమలిని (రూ.50 లక్షలు) ఉన్నారు. అంటే, ఎంఐ టీమ్‌లో హర్మన్‌ప్రీత్ కంటే నట్ సైవర్-బ్రంట్ జీతం (రూ.3.5 కోట్లు) ఎక్కువగా ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్లలో వేర్వేరు వ్యూహాలను అనుసరించాయి. డీసీ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, అందులో నలుగురు స్టార్ ప్లేయర్‌లకు ఒకే జీతం ఇచ్చింది. జైమిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, ఎనాబెల్ సదర్లాండ్, మారిజన్నె కాప్లకు ఒక్కొక్కరికీ రూ.2.2 కోట్లు చొప్పున చెల్లించనున్నారు. నిక్కీ ప్రసాద్‌ను రూ.50 లక్షలకు రిటైన్ చేసుకుంది.

ఆర్‌సీబీ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, కెప్టెన్ స్మృతి మంధాన (రూ.3.5 కోట్లు) తర్వాత రిచా ఘోష్ రూ.2.75 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఎలిస్ పెర్రీకి రూ.2 కోట్లు, శ్రేయాంక పాటిల్‌కు రూ.60 లక్షలు దక్కాయి. గుజరాత్ జెయింట్స్ కేవలం ఇద్దరిని, యూపీ వారియర్స్ ఒక్క ప్లేయరును మాత్రమే రిటైన్ చేసుకున్నాయి. గుజరాత్ జెయింట్స్ యాష్లీ గార్డ్‌నర్ (రూ.3.5 కోట్లు) కాకుండా, బేత్ మూనీకి రూ.2.5 కోట్లు చెల్లించనున్నారు. యూపీ టీమ్ ఒక్కే ఒక్క ఆటగాడైన శ్వేతా సెహ్రావత్‌ను రూ.50 లక్షలకు రిటైన్ చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories