Airtel: ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్స్.. బంపర్ ప్రయోజనాలు..!

Airtel new Plans Rs.519 plan Rs.779 Plans Chek for Details
x

Airtel: ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్స్.. బంపర్ ప్రయోజనాలు..!

Highlights

Airtel: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ యూజర్స్ కోసం సరికొత్త ప్లాన్స్ ప్రారంభించింది.

Airtel: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ యూజర్స్ కోసం సరికొత్త ప్లాన్స్ ప్రారంభించింది. వీటితో అదిరిపోయే బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో ఇతర టెలికాం కంపెనీలకు తిప్పలు తప్పడంలేదు. రిలయన్స్ జియోకు గట్టి పోటీనిచ్చేలా ఈ ప్లాన్స్ ఉన్నాయి. అందులో ఒకటి రూ.519, మరొకటి రూ.779. ఈ రెండు ప్లాన్స్ ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రూ.519 ప్లాన్: ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. ఇందులో భాగంగా రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల వస్తాయి. ఈ ప్లాన్ మొత్తంగా రూ.90 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌‌లో అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్, ఉచిత హెలోట్యూన్, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

రూ.779 ప్లాన్: ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లకు ప్రతి రోజూ 1.5 GB హై స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. మొత్తంగా 135 GB హై స్పీడ్ డేటాను ఈ ప్లాన్‌లో పొందుతారు. ఈ రెండు ప్లాన్స్‌ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. కానీ వ్యాలిడిటీ వేరుగా ఉంటుంది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలంటే రూ.779.ప్లాన్ తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories