Electric Scooters: దేశంలో ఇవి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఇంధనం, డబ్బు రెండు ఆదా..!

Cheapest Electric Scooters in India
x

Electric Scooters: దేశంలో ఇవి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఇంధనం, డబ్బు రెండు ఆదా..! 

Highlights

Electric Scooters: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

Electric Scooters: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మీరు తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే కొన్న స్కూటర్ల గురించి తెలుసుకోవాల్సిందే. వాటి ధరలు రూ. 45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. పెట్రోల్‌, డీజిల్‌ స్కూటర్ల కంటే చాలా తక్కువ.

Avan E స్కూటర్‌

Avon E స్కూటర్‌ ధర రూ. 45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 215 వాట్ల BLDC మోటార్‌ను కలిగి ఉంటుంది. దీని 48v/20ah బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 6 నుంచి 8 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 65 కిమీ/ఛార్జ్ రేంజ్ ఇస్తుంది. అలాగే 24 కిమీ గరిష్ట వేగంతో వెళుతుందని కంపెనీ పేర్కొంది.

బౌన్స్ ఇన్ఫినిటీ E1

బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో వస్తుంది. బ్యాటరీ ప్యాక్ లేని ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.45,099, బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.68,999. ఇది 1500 వాట్ల BLDC మోటార్‌ను కలిగి ఉంటుంది. ఇది 85 కిమీ/ఛార్జ్‌ల రేంజ్‌ని ఇవ్వగలదు.

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ధర రూ. 46,640 నుంచి మొదలై రూ. 59,640 వరకు ఉంటుంది. ఈ-స్కూటర్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది LX VRLA, టాప్ వేరియంట్ Flash LX. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ గరిష్టంగా 25 kmph వేగంతో, 85 km/ఛార్జ్ రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది.

అవన్ ట్రెండ్ ఈ

Avan Trend E ధర రూ. 56,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). సింగిల్-బ్యాటరీ ప్యాక్, డబుల్-బ్యాటరీ ప్యాక్. ఇది రెండు వేరియంట్‌లలో వచ్చింది. సింగిల్-బ్యాటరీ పవర్డ్ వేరియంట్ 60 కిమీ పరిధిని కలిగి ఉండగా, డబుల్-బ్యాటరీ పవర్డ్ వేరియంట్ 110 కిమీ పరిధిని కలిగి ఉంటుంది. రెండు వేరియంట్‌ల గరిష్ట వేగం గంటకు 45 కి.మీ.

Show Full Article
Print Article
Next Story
More Stories