స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Do not make these mistakes while exchanging smartphone you will lose
x

స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Highlights

*స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Smartphone Exchange: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే దాని ధరపై తగ్గింపును పొందాలనుకుంటే ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో వివిధ రకాల కంపెనీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఆన్‌లైన్ కంపెనీలు మంచి స్థితిలో ఉన్న మీ స్మార్ట్‌ఫోన్‌కి తక్కువ ధరను అంచనా వేస్తాయి.ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మంచి ధరని పొందవచ్చు.ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేయాలి

మీరు స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకునే ముందు దానిని శుభ్రం చేయడం మరచిపోవద్దు. లేదంటే చాలా తక్కువ మొత్తాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డర్టీ స్మార్ట్‌ఫోన్ కోసం ఎక్కువ మొత్తం చెల్లించడానికి ఏ కంపెనీ సిద్ధంగా ఉండదు. అందుకే ఎల్లప్పుడు స్మార్ట్‌ఫోన్‌ని శుభ్రంగా ఉంచుకోవాలి.

వెనుక ప్యానెల్‌ను మార్చండి

చాలా సార్లు స్మార్ట్‌ఫోన్ కొన్ని నెలల తర్వాత దాని వెనుక ప్యానెల్‌పై గీతలు పడుతాయి.ఇది జరిగిన తర్వాత కొత్త స్మార్ట్‌ఫోన్ పాతదిగా కనిపిస్తుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ చేసేటప్పుడు ముందు వెనుక ప్యానెల్‌ను మార్చాలి. అప్పుడు ఫోన్‌ కొత్తదిగా కనిపిస్తుంది.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌

పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేసుకునేటప్పుడు దాని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని గుర్తుంచుకోండి. ఇది వేగాన్ని పెంచుతుంది. దీనివల్ల మీ ఫోన్‌కు మంచి ధర లభిస్తుంది. ఈ చిట్కాలు పాటిస్తే పాత ఫోన్‌ని సులభంగా ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories