Car Engines: కార్ల ఇంజన్ల గురించి సంచలన నిర్ణయం తీసుకోబోతున్న కేంద్ర ప్రభుత్వం.. ఏంటంటే..?

The Central Government Is About To Make a Sensational Decision About Car Engines | Technology News
x

Car Engines: కార్ల ఇంజన్ల గురించి సంచలన నిర్ణయం తీసుకోబోతున్న కేంద్ర ప్రభుత్వం.. ఏంటంటే..?

Highlights

Car Engines: వచ్చే రెండు మూడు రోజుల్లో కార్ల కంపెనీలకు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉత్తర్వులు...

Car Engines: వచ్చే రెండు మూడు రోజుల్లో కార్ల కంపెనీలకు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఫ్లెక్స్-ఇంధన ఇంజిన్‌లు ఒకటి కంటే ఎక్కువ ఇంధనాన్ని వినియోగించగలవు. భారత్‌ ఏటా రూ.8 లక్షల కోట్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని గడ్కరీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై భారత్ ఆధారపడటం ఇలాగే కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో దిగుమతి బిల్లు రూ.25 లక్షల కోట్లకు పెరుగుతుందని తెలిపారు.

అందుకే పెట్రోలియం దిగుమతులను తగ్గించేందుకు మరో రెండు మూడు రోజుల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల ఆర్డర్‌పై సంతకం చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం.. ఇక నుంచి కార్ల తయారీదారులు ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్లను తీసుకురావడం తప్పనిసరి అవుతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ వాహనాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్‌లను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారని గడ్కరీ గుర్తు చేశారు.

Flex ఇంజిన్ ఎలా పని చేస్తుంది?

ఫ్లెక్స్ ఇంజిన్‌లో ఒక రకమైన ఫ్యూయల్ మిక్స్ సెన్సార్ అంటే ఫ్యూయల్ బ్లెండర్ సెన్సార్ ఉపయోగిస్తారు. ఇంధనం మొత్తాన్ని బట్టి ఇది స్వయంగా సర్దుబాటు అవుతుంది. మీరు డ్రైవింగ్ ప్రారంభించినప్పుడు ఈ సెన్సార్ ఇథనాల్, మిథనాల్, గ్యాసోలిన్ నిష్పత్తిని లేదా ఇంధనం ఆల్కహాల్ గాఢతను తెలుసుకుంటుంది. తరువాత ఎలక్ట్రానిక్ నియంత్రణ మాడ్యూల్‌కు సిగ్నల్‌ను పంపుతుంది.

ఫ్లెక్స్ ఇంజిన్‌లు ఉన్న వాహనాలు రెండు ఇంజిన్‌లు ఉన్న వాహనాలకు భిన్నంగా ఉంటాయి. ద్వి-ఇంధన ఇంజిన్‌లు వేర్వేరు ట్యాంకులను కలిగి ఉంటాయి అయితే ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్‌లలో ఒకే ట్యాంక్‌లో అనేక రకాల ఇంధనాన్ని నింపవచ్చు. ఇటువంటి ఇంజిన్లు ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఈ ఇంజిన్ వాహనాలలో పెట్రోల్-డీజిల్ డిజైన్ చేయవలసిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గతంలోనూ చాలాసార్లు చెప్పారు. ఇథనాల్ ధర లీటరుకు రూ. 60 నుంచి 62 ఉంటుంది. ఈ విధంగా ప్రజలు డీజిల్‌తో పోలిస్తే లీటరుకు 30 నుంచి 40 రూపాయలు ఆదా చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories