Bendalapadu: ఎఫ్‌ఆర్వో హత్య.. గొత్తికోయల గ్రామ బహిష్కరణ..

Bendalapadu Panchayat Village Boycott Gutti Koyas Over FRO Murder
x

Bendalapadu: ఎఫ్‌ఆర్వో హత్య.. గొత్తికోయల గ్రామ బహిష్కరణ..

Highlights

Bendalapadu: ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్‌రావు హత్యతో తెలంగాణలో అక్రమంగా చొరబడి ఉంటున్న గొత్తికోయలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Bendalapadu: ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్‌రావు హత్యతో తెలంగాణలో అక్రమంగా చొరబడి ఉంటున్న గొత్తికోయలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బెండలపాడు గ్రామంలో గొత్తికోయలను బహిష్కరిస్తూ పంచాయతీ తీర్మానం చేసింది. వారి సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌ఘడ్‌కు పంపించాలని తీర్మానంలో ప్రముఖంగా పేర్కొన్నారు. గంజాయి సాగు చేయడంతో పాటు ఇప్పసార సేవిస్తూ, మారణాయుధాలను కలిగి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారని, గొత్తికోయల వల్ల గ్రామప్రజలకు ప్రాణహాని ఉందని గ్రామస్తులు ముక్తకంఠంగా తీర్మానించారు. శ్రీనివాస్‌రావు హత్యను ఖండించిన గ్రామసభ వీలైనంత త్వరగా గొత్తికోయలను వారి స్వరాష్ట్రానికి పంపించాలని తీర్మానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories