Bhainsa Hospital: కరోనా సమయంలో గర్భిణీలకు అండగా భైంసా ఆస్పత్రి వైద్యులు

Bainsa hospital doctors helps pregnant women
x

Bhainsa Hospital: కరోనా సమయంలో గర్భిణీలకు అండగా భైంసా ఆస్పత్రి వైద్యులు

Highlights

Bhainsa Hospital: కరోనా మహమ్మారి కారణంగా బంధుత్వాలు దూరమవుతున్న ఈ రోజుల్లో కరోనా సోకిన గర్భిణీలకు అండగా నిలబడి, ప్రసవాలు చేస్తున్నారు నిర్మల్‌ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది.

Bhainsa Hospital: కరోనా మహమ్మారి కారణంగా బంధుత్వాలు దూరమవుతున్న ఈ రోజుల్లో కరోనా సోకిన గర్భిణీలకు అండగా నిలబడి, ప్రసవాలు చేస్తున్నారు నిర్మల్‌ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది. పండంటి బిడ్డలకు జన్మనిచ్చేలా చేసి తల్లి, బిడ్డలను సురక్షితంగా ఇళ్లకు పంపుతున్నారు. కోవిడ్‌ బారిన పడ్డ గర్భిణీలను అక్కున చేర్చుకొని, వారికి ట్రీట్‌మెంట్‌ ఇస్తూ ప్రసవాలు చేస్తున్నారు. గర్భిణీలతో శారీరక వ్యాయామాలు చేయించి సాధారణ ప్రసవాలు జరిగేలా చూస్తున్నారు. ఇప్పటివరకు 8మంది కోవిడ్‌ బాధిత గర్భిణీల్లో ఏడుగురికి సాధారణ ప్రసవాలు చేయగా ఓ మహిళకు మాత్రం తప్పని పరిస్థితుల్లో సిజేరియన్‌ చేసి పురుడు పోశారు అక్కడి డాక్టర్లు.


Show Full Article
Print Article
Next Story
More Stories