logo
తెలంగాణ

Singareni: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌

CM KCR Announces New Retirement Age For Singareni Workers
X

Singareni: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌

Highlights

Singareni: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.

Singareni: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను సీఎం ఆదేశించారు.

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది. రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.


Web TitleCM KCR Announces New Retirement Age For Singareni Workers
Next Story