logo
తెలంగాణ

సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..

Etela Jamuna Open Challenge To CM KCR Over Land Grab Allegations
X

సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..

Highlights

Etela Jamuna: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హేచరీస్ చైర్మన్ ఈటల జమున ఫైర్ అయ్యారు.

Etela Jamuna: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హేచరీస్ చైర్మన్ ఈటల జమున ఫైర్ అయ్యారు. తాము ఒక గుంట భూమి కూడా కబ్జా చేయలేదన్నారు. జమున హేచరీస్ కబ్జా చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఇచ్చిన సర్వే నంబర్లకు ఎటువంటి పొంతన లేదని కక్ష పూరిత చర్యలకు కెసిఆర్ పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మా భూములను కెసిఆర్ ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు.

మేము భూమి ఆక్రమించుకున్నట్లు రుజువు చేస్తారా అని ప్రశ్నించారు జమున. కావాలంటే సీఎం కేసీఆర్‌ రేపే వచ్చి భూములు తనిఖీ చేసుకోవచ్చని చెప్పారు. తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని సవాల్‌ చేశారు ఈటల రాజేందర్‌ భార్య. తమ భూములను పంచుతున్నామంటూ కేసీఆర్ అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యే తాజాగా పంచిపెట్టిన ఆ భూములు తమవి కానే కావని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే కేసీఆర్‌ ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌ లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్‌ మారడం లేదని మండిపడ్డారు.


Web TitleEtela Jamuna Open Challenge To CM KCR Over Land Grab Allegations
Next Story