తెలంగాణ యూనివర్సిటీలపై గవర్నర్‌ ఫోకస్‌

Governor Tamilisai Soundararajan Visit Basara IIIT Campus
x

తెలంగాణ యూనివర్సిటీలపై గవర్నర్‌ ఫోకస్‌

Highlights

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీని పరిశీలించిన గవర్నర్‌

Basara IIIT: తెలంగాణ యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై ఫోకస్ పెట్టారు గవర్నర్ తమిళసై వారం రోజుల క్రితం తనను కలిసేందుకు రాజ్ భవన్ వచ్చిన విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం యూనివర్సిటీల బాట పట్టారు బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ ను పరిశీలించిన గవర్నర్‌ క్యాంపస్ లో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

క్యాంపస్‌లో మెస్, హాస్టళ్లను గవర్నర్ పరిశీలించారు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలను విద్యార్ధులు గవర్నర్‌ దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఆ తర్వాత వీసి, డైరక్టర్‌తో పాటు ఫ్యాకల్టీ, యూనివర్సిటీ సిబ్బందితో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ట్రిపుల్ ఐటీ మెయిన్‌ గేటు దగ్గర మీడియాతో మాట్లాడిన గవర్నర్ క్యాంపస్ లో అనేక సమస్యలు ఉన్న మాట వాస్తవమేనన్నారు విద్యార్ధులు భోజనం విషయంలో ఇబ్బంది పడుతున్నారని, అదే విధంగా వారికి కావాల్సిన ల్యాప్ ట్యాప్‌లతో పాటు మరికొన్ని మెటీరియల్స్ లేకపోవడం, బోధన సిబ్బంది కొరత కారణంగా పిల్లల చదువుపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ తల్లిగా ట్రిపుల్ ఐటి విద్యార్ధుల కష్టాలు తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలుచేపడతామని స్పష్టం చేశారు.

గవర్నర్ పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులు మరొసారి ప్రొటోకాల్ పాటించకపోవడం జిల్లాలో చర్చకు దారితీసింది జిల్లా కలెక్టర్, ఎస్పీలు గవర్నర్ టూర్ కు డుమ్మా కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గవర్నర్ మాత్రం అదంతా ఓపెన్ సీక్రెట్ అంటూ లైట్ గా తీసుకోవడం కొసమెరుపు. మొత్తం మీద గవర్నర్ విశ్వవిద్యాలయాల్లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories