Jubilee Hills By-poll Result: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం

Jubilee Hills By-poll Result: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం
x
Highlights

Jubilee Hills By-poll Result: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది....

Jubilee Hills By-poll Result: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థిపై 25 వేల ఓట్లకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యం రౌండ్‌ రౌండ్‌కు పెరుగుతూ పోయింది. మరోవైపు, BRS అభ్యర్థి మాగంటి సునీత ఏ ఒక్క రౌండ్‌లోనూ ఆధిక్యం దక్కించుకోలేకపోయారు.

ఈ విజయం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మరియు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్ని, మరింత నైతిక బలాన్ని ఇచ్చింది. జూబ్లీహిల్స్ వంటి ప్రతిష్ఠాత్మక స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవడం పార్టీకి ఒక పెద్ద ఊరటగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories