జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బొక్క బోర్లా పడ్డ బీజేపీ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బొక్క బోర్లా పడ్డ బీజేపీ
x
Highlights

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాశలుగా మిగిలాయి. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో సత్తాచాటలేక...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాశలుగా మిగిలాయి. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో సత్తాచాటలేక చతికిలపడింది. జూబ్లీహిల్స్ బై పోల్‌లో గెలిచి.... రాబోయే రోజుల్లో అధికారం తమదే అనే సంకేతాలు పంపాలని భావించింది. అందుకు అనుగుణంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అడుగులు వేశారు. మొదట్లో జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలిచి మోడీకి గిఫ్ట్ ఇస్తామంటూ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డంకా బజాయించి చెప్పారు. కానీ ఆయన చెప్పిన మాటలకు క్షేత్రస్థాయిలో కార్యచరణకు చాలా తేడా కనిపించింది. నోటిఫికేషన్ రాకముందు ఉన్న జోష్.. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పార్టీ నేతల్లో కనుమరుగైంది.

కమలనాధులు అభ్యర్థి ప్రకటన నుంచి ప్రచారం వరకు పూర్తిగా వెనకబడి పోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే బీఆర్ఎస్ ముందుగా తమ అభ్యర్థిని ప్రకటించింది. అదే కోవలోనే కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ముందుకు వెళ్లాయి. కానీ బీజేపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించడంలోనూ జాప్యం చేసింది. అదేవిధంగా ప్రచారం చేయడంలోనూ అదే అలసత్వం వహించడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది.

ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు కమలం పార్టీలో పలువురు పోర్టు పడినప్పటికీ... గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన లంకల దీపక్ రెడ్డికే మరోసారి టికెట్ ఇవ్వడం కూడా ఆ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. గత ఎన్నికల్లో ఆయన కేవలం మూడో స్థానానికే పరిమితి కావడం.... పార్టీ క్యాడర్‌కి అందుబాటులో ఉండడని ఆరోపణలు ఉన్నా.. అధిష్టానం ఆయన వైపే ముగ్గు చూపడం మరో కారణంగా కనిపిస్తుంది. రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలముకులై తలబడుతుంటే.... బీజెపీ మాత్రం కమిటీల వేయడంలోనూ... అంతర్గత సమావేశాలకు మాత్రమే పరిమితం కావడం ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పార్టీలోని ముఖ్య నేతలు అటువైపు ప్రచారం చేసేందుకు వెళ్ళకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. కేవలం కిషన్ రెడ్డి మాత్రమే ప్రచారం చేయడం... అది కూడా తూతూ మంత్రంగా చేయడం కూడా ఓ కారణంగా తెలుస్తుంది. అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి... జూబ్లీహిల్స్ పరిధిలో బూతు స్థాయి కమిటీలో కూడా లేకపోవడం దీనికి మరో కారణంగా కనిపిస్తుంది. బీజేపీ సెంట్రల్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన బూతు స్థాయిలో కమిటీలు వేయకపోవడంతో ప్రశ్న కూడా కార్యకర్తల్లో ఉత్పన్నమైంది. అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి నాయకులను తోపాటు కార్యకర్తలను సమన్వయం చేసుకోకపోవడం ప్రధాన లోటుగా కనిపిస్తుంది.

రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలతో దాదాపుగా 23 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరిలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు.. ఉన్నప్పటికీ ప్రచారం చేయడంలో వెనకబడి పోయారు. కేవలం 4 రోజుల ముందు మాత్రమే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ప్రధాన లోటుగా కనిపిస్తుంది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉండడం కూడా మరో కారణం. అదేవిధంగా రఘునందన్ రావు ప్రచారం చేసినప్పటికీ ఇలా వచ్చామా అలా వెళ్ళామా అనే తీరు పార్టీలో కీలకంగా చర్చ జరుగుతోంది.

ఉప ఎన్నికలో కీలకమైన పోల్ మేనేజ్‌మెంట్ లోనూ బీజేపీ పూర్తిగా విఫలం అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటుున్నారు. ప్రచారంలో వెనుకబడిన కమలనాధులు పోల్ మేనేజ్‌మెంట్‌ లోనూ పూర్తిగా పట్టించుకోకపోవడం.. మూడో స్థానానికి పడిపోయింది. ఇన్నీ వైఫల్యాలతో గతంలో లాగే ఈ బై ఎలక్షన్‌లోనూ బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories