రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత

రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత
x
Highlights

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, ఓడిపోయిన బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, ఓడిపోయిన బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల ప్రక్రియపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నిక రౌడీయిజంతో జరిగిందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె అభివర్ణించారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆమె మీడియా ముందు స్పందించారు. ఈ సందర్భంగా మాగంటి సునీత మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

"ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు" అని కాంగ్రెస్ నేతలపై ఆమె విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.

ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం (ఈసీ) పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపు అసలు గెలుపే కాదని, నైతికంగా తానే గెలిచానని మాగంటి సునీత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories