Nalgonda: నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు తయారీ

Manufacture of  Kalthi Kallu in Nalgonda District
x

Nalgonda: నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు తయారీ

Highlights

Nalgonda: కల్తీ కల్లుతో ఆరోగ్యానికి చిల్లు

Nalgonda: స్వచ్ఛమైన కల్లుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధి. కానీ ప్రస్తుతం కల్తీ కల్లు విషం చిమ్ముతోంది. కల్లును కల్తీ చేయడంతో దానికి అలవాటు పడిన వారు అనారోగ్యం పాలవుతున్నారు. పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అడపాదడపా దాడుల్లో పెద్ద ఎత్తున కల్లులో కల్తీ చేసే పదార్దాలు లభ్యమవుతుంటే.. నిత్యం నిఘా పెడితే ఇంకా పరిస్ధితి ఎలా ఉంటుందోనన్న అనుమానాలు స్ధానికులు వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో కల్లుతాగే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేదు. తక్కువ ఉత్పత్తి.. ఎక్కువ డిమాండ్ ఉండటంతో నిషేధిత కల్తీ కల్లుకు తయారీకి మొగ్గు చూపుతున్నారు. రెండేళ్ల కింద నకిరెకల్‌లో ఓ ఇంట్లో ఏకంగా 500 కేజీల కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే మెటీరియల్‌ను సీజ్ చేశారు. ఆపై నార్కట్‌పల్లిలోనూ ఓ ఇంట్లో 600 కేజీల కల్లు తయారీ మందు సీజ్ చేయడం అప్పట్లో కలకలం రేపింది.

తాజాగా కల్తీ కల్లు మందు క్లోరల్ హైడ్రేట్ రవాణా చేస్తూడంగా.. ఎక్సైజ్ ఎన్ఫోర్మ్మెంట్ అధికారులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నార్కట్‌పల్లి తుమ్మలగుడానికి చెందిన ఓ వ్యక్తి కారులో 150కిలోల మత్తు మందు రవాణా చేస్తూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మ్ంట్ టీంకి పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. కల్తీ కల్లు తయారు చేసినా అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ నల్గొండ నుంచి జీవన వృత్తిలో భాగంగా సూరత్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా లాంటి ప్రాంతాలకు వెళ్లి కల్లు చేస్తుంటారు. కొంత ఆదాయం సంపాదించుకుని తిరిగి సొంత ప్రాంతాలకు వస్తుంటారు. అయితే నల్గొండ జిల్లాలో తక్కువ మొత్తంలో కల్లు వచ్చినప్పడు, కల్తీ కల్లుపై దృష్టిపెడుతుంటారు.

కల్తీ కల్లు తయారీలో వేసే క్లోరల్ హైడ్రేట్ ఎక్కువ మోతాదులో వేస్తే హార్ట్ బీట్ స్లో అవుతుందని, నరాల బలహీనత ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.కల్తీ కల్లు నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈత, తాటి వనాలను ఏర్పాటు చేస్తుంది. దీనిని సద్వనియోగం చేసుకోవాలని అప్పుడే కల్తీ కల్లుపై ఉక్కపాదం మోపగలరని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories