రేప్ చేసిన తండ్రి, విచారణ మధ్యలో వదిలేసిన తల్లి... POCSO Case లో ఒంటరిగా పోరాడి గెలిచిన బాలిక

Nepali teenager raped by dad in Hyderabad, deserted by mother but fought for justice alone against her family
x

తండ్రి రేప్ చేశాడు, తల్లి మధ్యలో వదిలేసింది... POCSO Case లో ఒంటరిగా తండ్రిపై న్యాయ పోరాటం చేసి గెలిచిన మైనర్ బాలిక

Highlights

పోక్సో యాక్ట్ కింద నమోదైన మైనర్ రేప్ కేసులో 11 మంది సాక్షులు, 14 ఆధారాలు, 3 మెటీరియల్స్ పరిశీలించిన నాంపల్లి కోర్టు

Minor girl's lonely legal battle against her father: హైదరాబాద్‌లో ఒక మైనర్ బాలిక సొంత తల్లిదండ్రులపైనే న్యాయ పోరాటం చేసి గెలిచిన ఘటన ఇది. అది కూడా ఎక్కడో నేపాల్ నుండి బతుకుదెరువు కోసం వలస వచ్చిన కుటుంబానికి చెందిన బాలిక సొంత కుటుంబంపై పరాయి గడ్డపై చేసిన న్యాయ పోరాటం ఇది. కన్న తండ్రే బిడ్డను రేప్ చేశాడు. బిడ్డను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి ఆ తరువాత భర్త ఒత్తిళ్లతో వెనక్కి తగ్గారు. దీంతో ఇంట్లోనే కాదు... న్యాయ పోరాటంలోనూ ఆ బాలిక ఒంటరిదైపోయింది. కానీ అవేవీ ఆ మైనర్ బాలిక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. అమ్మ తోడు లేకుండానే నాన్నపై కేసు గెలిచి ఆయన్ను జైలుకు పంపించారు.

అసలేం జరిగింది?

అది 2023 సెప్టెంబర్ నెల. బాగా మద్యం తాగొచ్చిన తండ్రి ఇంట్లో నిద్రిస్తున్న బిడ్డపై కన్నేశాడు. కత్తితో బెదిరించి ఆమెపై పడి పశువాంఛ తీర్చుకున్నాడు. మరునాడు ఆ బాలిక జరిగిన విషయం అమ్మకు చెప్పారు. ఇద్దరూ కలిసి వెళ్లి దోమలగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకుని ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నాంపల్లిలో పోక్సో కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ మొదలైంది.

కేసు దర్యాప్తు మధ్యలో ఉండగా బాలిక తల్లి తన భర్త వైపు నుండి ఒత్తిళ్లకు తలొగ్గి ప్లేట్ ఫిరాయించారు. పైగా పోలీసులే తన చేత తప్పుడు ఫిర్యాదు చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారని కోర్టుకు తెలిపారు. కానీ ఆమె మాటలను న్యాయస్థానం నమ్మలేదు. ఎందుకంటే, అప్పటి వరకు జరిగిన విచారణలో ఆమె స్వయంగా ఇచ్చిన వాంగ్మూలం కోర్టు వద్ద ఉంది. తన భర్తే బిడ్డపై అత్యాచారం చేశారని ఆమె మొదట్లో ఇచ్చిన వాంగ్మూలాన్నే కోర్టు అంతిమంగా పరిగణనలోకి తీసుకుంది.

మరోవైపు బాధితురాలి కన్న తండ్రి కూడా ఈ కేసులోంచి బయటపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు లైంగిక పటుత్వం లేదని కోర్టుకు తెలిపారు. అంతేకాదు... అత్యాచారం జరిగిన తీరును బాధితురాలు సరిగ్గా చెప్పలేకపోతున్నారంటే అందులో వాస్తవం లేదని వాదించారు. ఇంట్లో ఉన్న గొడవల వల్లే తనపై ఇలాంటి తప్పుడు కేసు పెట్టేందుకు కారణమైందని చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

నాంపల్లి కోర్టు ఏం చెప్పింది?

అంతిమంగా ఈ కేసులో 11 మంది సాక్షులు, 14 ఆధారాలు, 3 మెటీరియల్స్ పరిశీలించిన కోర్టు... కన్న తండ్రిపై బాలిక చేస్తోన్న ఒంటరి న్యాయ పోరాటాన్ని అర్థం చేసుకుంది. ఏ బిడ్డ కూడా కారణం లేనిదే తన కన్న తండ్రిపై రేప్ కేసు పెట్టరని కోర్టు అభిప్రాయపడింది. తండ్రి తప్పు చేశారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతూ ఆయనకు జీవిత కాలం కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బాలికను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేదనకు గురిచేసినందున ఆమెకు రూ. 2 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా నాంపల్లి స్పెషల్ కోర్టు ఆదేశించింది. మద్యం మత్తులో చేసిన తప్పు ఆ జీవితంపై మాయని మచ్చ పడేలా చేసింది.

మద్యం, డ్రగ్స్ అలవాటును మానేసేందుకు ఉచితంగా డీ అడిక్షన్ సెంటర్స్

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం సమాజంలో నేరాలు, ప్రమాదాలు పెరిగిపోవడానికి మద్యం, డ్రగ్స్ వినియోగం ఒక కారణం అని తేలింది. మద్యం తాగిన మైకంలో, డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా, విచక్షణ లేకుండా నేరాలు చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెబుతోంది.

అందుకే మద్యం, డ్రగ్స్ వాడే వారికి ఆ అలవాట్లను దూరం చేసేందుకు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు డీ అడిక్షన్ కేంద్రాలు ప్రారంభించి ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నాయి. తెలంగాణలో ప్రతీ జిల్లాకు ఒక డిఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏపీలోనూ అన్ని జిల్లాల్లో ప్రభుత్వమే నిర్వహిస్తోన్న డి అడిక్షన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని జిల్లా ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాల కోసం కింది డీటేయిల్స్ చూడొచ్చు.



గమనిక: లైంగిక వేధింపుల కేసు కావడం వల్ల బాధితురాలి వివరాలు వెల్లడించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories