Raja Singh: బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపాటు

Raja Singh: బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపాటు
x
Highlights

బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు చేశారు. బీజేపీ నేతలు...

బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు చేశారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలను చూసి నేర్చుకోవాలన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలవాలని కాంగ్రెస్ నేతలు పనిచేస్తే.. బీజేపీ నేతలు ఎలా ఓడిపోవాలో పనిచేశారన్నారు. బీజేపీ నేతల తీరు చూసే రాబోయే జీహెచ్ఎంసీ, లోకల్ బాడీ ఎన్నికల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

బీజేపీ కార్యకర్తలు నేతలు ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలో చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ ఓటమికి బాధ్యులు ఎవరని అడిగారు. బీజేపీని బండి సంజయ్, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ పూర్తిగా బ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలా అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కలలాగానే మిగిలిపోతుందన్నారు. నేను కిషన్‌రెడ్డిని టార్గెట్ చేయడం లేదని.. పార్టీ నాశనం అవుతుందని తన బాధ అని ఆవేదన వ్యక్తం చెందారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories