Sputnik-V -Vaccine: హైదరాబాద్ చేరిన రష్యా టీకాలు

Sputnik -V-Vaccines From Russia Arrive in Hyderabad
x

Sputnik V-Vaccine:(File Image)

Highlights

Sputnik -V -Vaccine: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాలు మార్కసో నుంచి ప్రత్యేక విమానంలో నేడు హైదరాబాద్ కు చేరాయి

Sputnik -V-Vaccine: భారత్ లో కరోనా వ్యాక్సిన్‌ కొరత తీర్చేందుకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. అటు, విదేశీ కంపెనీలు భారత్‌లో వ్యాక్సిన్‌ తయారు చేయడానికి ముందుకొస్తే వెంటనే అనుమతిస్తామని కేంద్రం తెలిపింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాలు మార్కసో నుంచి ప్రత్యేక విమానంలో నేడు హైదరాబాద్ కు చేరుకున్నాయి. తొలి విడతో భాగంగా 1.5 లక్షల వయల్స్ భారత్ కు చేరాయి.

వీటిలో తొలుత భారత్ లో స్పుత్నిక్-వి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు అందించనున్నారు. కాసౌలీలోని సెంట్రల్ డ్రగ్స్ ఆమోదం లభించిన తర్వాత రెడ్డీస్ ల్యాబ్స్ వీటిని వ్యాక్సినేషన్ ప్రక్రియ అందించనుంది. ఈ నెలలోనే మరో మూడు మిలియన్ల డోసులు, జూన్ లో ఐదు మిలియన్లు, జులైలో మరో 10 మిలియన్ల డోసులు భారత్ కు రానున్నట్లు తెలిపాయి.

రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో గమలేయా ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ టీకాను భారత్ లో ఉత్పత్తి, పంపిణీకి గతేడాది సెప్టెంబర్లోనే డాక్టర్ రెడ్డీస్ తో ఒప్పందం కుదిరింది.మరో వైపు భారత్‌లో వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ ముందుకొచ్చింది. అటు కోవాగ్జిన్‌ టీకా ఫార్మూలాను ఇతర కంపెనీలకు ఇవ్వడానికి కేంద్రంతో పాటు భారత్‌ బయోటెక్‌ కంపెనీ కూడా సిద్దమని ప్రకటించాయి. అయితే కొవాగ్జిన్‌ ఫార్ములా ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ సిద్ధంగా ఉన్నా, టీకా తయారు చేసేందుకు BSL 3 ల్యాబ్స్‌ ఉన్నాయా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే భారత్‌లో కోవాగ్జిన్‌ ఫార్మూలాను ఉపయోగించి టీకా తయారు చేసే అధునాతన ల్యాబ్‌లు లేవంటున్నారు నీతిఅయోగ్‌ సభ్యుడు వీకేపాల్‌. డిసెంబర్‌ నాటికి భారత్‌కి 216 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. కోవాగ్జిన్‌ టీకా తయారీకీ అధునాతన బీఎస్‌ఎల్‌ 3 ల్యాబ్‌లు అవసరమంటున్నారు. వాటిలో భారత్‌ బయోటెక్‌కు చెందిన సింగిల్‌ డ్రాప్‌, సింగిల్‌ డోస్‌ నాసల్‌ వ్యాక్సిన్లు కూడా (ముక్కు ద్వారా తీసుకునేవి) ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకు భారత్‌లో దాదాపు 18 కోట్ల డోసులు అందించామని, జులై నాటికి ఈ సంఖ్య 35.6 కోట్లకు చేరుతుందని తెలిపారు. అత్యధిక డోసులు వేసిన దేశాల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉందని పాల్‌ వెల్లడించారు.

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13.76 కోట్ల మంది మొదటి డోసు వేయించుకున్నారు. 3.96 కోట్ల మంది రెండో డోసునూ పొందారు. 45 ఏళ్లు దాటినవారు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది ఉండగా, వారిలో 1/3వ వంతు మందికి ఒక డోసు అందింది. కొవిడ్‌ మృతుల్లో 88% మంది ఈ వయస్సు వారే. వారికి టీకా అందించడంతో మరణాల రేటు తగ్గే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories