Lockdown: తెలంగాణలో మూడోరోజు లాక్‌డౌన్‌

Telangana Lockdown Day-3
x

Lockdown: తెలంగాణలో మూడోరోజు లాక్‌డౌన్‌

Highlights

Lockdown: తెలంగాణలో కరోనా ఉధృతి కట్టడికి ప్రభుత్వం 10రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది.

Lockdown: తెలంగాణలో కరోనా ఉధృతి కట్టడికి ప్రభుత్వం 10రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది. రాష్ట్రంలో మూడోరోజు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ నుంచి సండలింపు ఇవ్వడంతో హైదరాబాద్‌ రోడ్లపైకి భారీగా చేరుకుంటున్నారు ప్రజలు. దీంతో ఉదయం నుంచే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మరోవైపు రంజాన్‌ సందర్భంగా నిత్యావసరాలు, ఫ్రూట్‌ మార్కెట్లు, కూరగాయల దుకాణాల దగ్గర బారులు తీరారు ప్రజలు. ఇంకోపక్క రోడ్లపై వాహనాల రాకపోకలతో పలు జంక్షన్ల దగ్గర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

ఇక నాలుగు గంటలు మాత్రమే లాక్‌డౌన్‌ మినహాయింపు ఉండటంతో జనం రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మద్యం షాపులు, పెట్రోల్‌ బంకులు, ఫిష్‌ మార్కెట్ల దగ్గర భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. కనీసం మాస్కులు ధరించకుండా భౌతికదూరం పాటించకుండా ఎంతో నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు ప్రజలు. కరోనా నిబంధనలు పాటించనివారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు సొంతూళ్లకు వెళ్లేవారితో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. టోల్‌ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌ ఉండడంతో వాహనాలు దూసుకుపోతున్నాయి.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల‌ ప‌నివేళ‌ల్లో కూడా మార్పులు చేశారు. నిన్నటి నుంచి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప‌నిచేస్తున్నాయి. అదేవిధంగా పోస్టాఫీసుల్లో వినియోగ‌దారుల సేవ‌ల స‌మ‌యాల‌ను త‌పాలా శాఖ కుదించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంట‌ర్లు ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, చిన్న పోస్టాఫీసుల్లో ఉద‌యం 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తున్నాయి. డెలివ‌రీ స‌హా ఇత‌ర సేవ‌లు గ‌తంలో మాదిరిగానే కొన‌సాగుతున్నాయి.

ఉదయం 10 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. అత్యవసర సేవలు మినహా మిగిలినవారిని అడ్డుకొని, చలాన్లు విధిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు బుక్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories