AP Ambulances: అంబులెన్సుల నిలిపివేతపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ వివరణ

TS Advocate General Explains High Court Over Andhra Pradesh Telangana Border Issues
x

TS High Court: (file image)

Highlights

AP Ambulances: ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్సులను నిలిపివేతపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరణ ఇఛ్చారు.

AP Ambulances: ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్సులను నిలిపివేతపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరణ ఇఛ్చారు. తెలంగాణ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారులు అన్నీ ఆలోచించే సరిహద్దు రాష్ట్రాలపై ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దాంతో, అంబులెన్సులను ఆపడం ఎక్కడైనా చూశామా అంటూ తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అసలు అంబులెన్సులను నిలువరించే ముందు సర్క్యులర్ జారీ చేశారా? అంటూ హైకోర్టు నిలదీసింది.

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పేషంట్లను నిలువరించడం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించింది. రైట్ టు లైఫ్‌ను ఆపడానికి మీకు ఏం అధికారం ఉందంటూ నిలదీసింది. అయితే, ఢిల్లీ, మహారాష్ట్రలోనూ ఇలాంటి నిబంధన ఉందన్న అడ్వకేట్ జనరల్‌ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా మేలు చేస్తుందన్నారు. అయితే, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి నిబంధన చూడలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. దాంతో, ఇతర రాష్ట్రాల్లో నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతిస్తున్నారని ఢిల్లీ, మహారాష్ట్రలో ఇలాంటి నిబంధనే ఉందని తెలంగాణ అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చారు.

సరిహద్దుల్లో రోగులు చనిపోతుంటే మీరెలా సర్క్యులర్ జారీ చేస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. అయితే, హైదరాబాద్‌లో ఆస్పత్రి నుంచి అనుమతి ఉంటే పేషంట్లను అనుమతి ఇస్తున్నామని ఏజీ వివరించారు. ఏపీతోపాటు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైనా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్నాటక విషయంలోనూ ఇదే నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories