Echoda: హైందవ స్వరాజ్య ప్రతీక.. 352వ పట్టాభిషేక దినోత్సవ వేడుకల్లో నివాళులు!

Echoda: ఇచ్చోడ మండల కేంద్రంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 352వ పట్టాభిషేక దినోత్సవం.

NAGULA SATISH, BOATH
Published on: 6 Jun 2026 12:55 PM IST
Echoda
X

Echoda: హైందవ స్వరాజ్య ప్రతీక.. 352వ పట్టాభిషేక దినోత్సవ వేడుకల్లో నివాళులు!

Echoda: ఇచ్చోడ మండల కేంద్రంలో ఆరే మరాఠి సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 352వ పట్టాభిషేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు సాయికిరణ్ జాధవ్ మాట్లాడుతూ, 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో జరిగిన ఈ పట్టాభిషేకంతోనే హైందవ స్వరాజ్యానికి అధికారిక గుర్తింపు లభించిందని, శివాజీ మహారాజ్ "ఛత్రపతి" బిరుదును స్వీకరించి మరాఠా సామ్రాజ్యానికి సార్వభౌమ రాజుగా ప్రకటించబడ్డారని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మెండల్కర్ లక్ష్మణ్, కదం చంద్రకాంత్, బాలాజీ సూర్యవంశీ, పవార్ రాజు, చౌహాన్ రజనీకాంత్, హనుమంత్ రావ్ జాధవ్ తదితరులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story