Gudihathnoor: శిథిలావస్థలో గుడిహత్నూర్ సహకార సంఘం భవనం
Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పీఏసీఎస్ (PACS) కార్యాలయ భవనం దయనీయ స్థితి. పగుళ్లు వారిన గోడల మధ్య ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని విధుల్లో సిబ్బంది.
Gudihathnoor: శిథిలావస్థలో గుడిహత్నూర్ సహకార సంఘం భవనం
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయ భవనం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. కార్యాలయం లోపలి గదుల గోడలకు, బయటి వైపున పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అక్కడి సిబ్బంది, పనుల కోసం వచ్చే రైతులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కిటికీలు, తలుపుల పక్కన ఉన్న ఇటుకల గోడలు సైతం పెచ్చులూడిపోయి ప్రమాదకరంగా మారాయి.
ఇటువంటి ప్రమాదకర స్థితిలో ఉన్న కార్యాలయంలోనే కూర్చుని సిబ్బంది ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం వందలాది మంది రైతులు తమ వ్యవసాయ పనుల నిమిత్తం, రుణాల కోసం వచ్చే రైతులు ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందినీ వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే స్పందించి ఈ భవనానికి మరమ్మతులు చేపట్టాలని లేదా కొత్త భవనాన్ని నిర్మించాలని స్థానిక రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




