Gudihathnoor: పీహెచ్‌సీలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ.. రికార్డుల పరిశీలన

Gudihathnoor: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (PO) మంద మకరందు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

NAGULA SATISH, BOATH
Published on: 26 May 2026 5:42 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: పీహెచ్‌సీలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ.. రికార్డుల పరిశీలన

​గుడిహత్నూర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉట్నూర్ ఐటీడీఏ (PO) ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని ప్రసూతి గది, ఫార్మసీ, ల్యాబ్‌లను పరిశీలించడంతో పాటు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నందున వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి రోగులకు సేవలు అందించాలని సూచించారు.

ముఖ్యంగా మాతా శిశు మరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ప్రసూతి మరణాలు సంభవిస్తే బాధ్యులపై చర్యలు తీవ్ర స్థాయిలో ఉంటాయని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఆయన వెంట జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ కుడ్మేత మనోహర్, మండల వైద్యాధికారి డాక్టర్ నీలోఫర్ తదితరులు ఉన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story