CV Anand: ఆదిలాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ తొలి పర్యటన..
CV Anand: తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారి పర్యటించనున్నారు.
CV Anand: ఆదిలాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ తొలి పర్యటన..
ఆదిలాబాద్: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం జిల్లాలో తొలిసారిగా పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు పోలీస్ అధికారులతో క్రైమ్ రివ్యూ నిర్వహించిన అనంతరం, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో హైడ్రాలిక్స్, ఫ్యామిలీ క్వార్టర్స్‌లో చిల్డ్రన్ పార్క్, డీపీఓ ఎదురుగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మరియు కలెక్టర్ చౌరస్తా వద్ద నూతన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఆయన ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12:05 గంటలకు గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చేరుకుని ప్రజాపాలన గ్రామసభలో పాల్గొంటారు. అక్కడ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం, హెల్మెట్లు, వాలీబాల్ కిట్లు, లర్నింగ్ లైసెన్స్‌ల పంపిణీతో పాటు విపత్తు నిర్వహణ పరికరాల అందజేత, సీపీఆర్ శిక్షణ, ఉచిత కంటి వైద్య శిబిరం వంటి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పర్యటన అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.




