Sri Sathya Sai: రౌడీషీటర్లకు ఎస్పీ సతీష్ కుమార్ గట్టి వార్నింగ్!
Sri Sathya Sai: శ్రీసత్యసాయి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు రౌడీషీటర్లు.
Sri Sathya Sai: రౌడీషీటర్లకు ఎస్పీ సతీష్ కుమార్ గట్టి వార్నింగ్!
శ్రీసత్యసాయి: జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటం, నేరాలను పూర్తిగా అరికట్టడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేర చరిత్ర గల వ్యక్తులు, సస్పెక్ట్ షీటర్లకు విస్తృతంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు స్పష్టంగా హెచ్చరించారు. నేర ప్రవర్తనను వెంటనే విడనాడి, సత్ప్రవర్తనతో జీవనం సాగించాలని సూచించారు.
ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే, ఇప్పటికే ఉన్న కేసులకు అదనంగా మరిన్ని క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి.హెచ్చరించారు.జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రతి అనుమానాస్పద చర్యను పోలీసులు సమీక్షిస్తున్నారని తెలిపారు.




