Nellore: అమరావతికి చట్టబద్ధత చారిత్రాత్మకం.. ఎంపీ కీలక వ్యాఖ్యలు
Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Nellore: అమరావతికి చట్టబద్ధత చారిత్రాత్మకం.. ఎంపీ కీలక వ్యాఖ్యలు
Nellore: అమరావతికి చట్టబద్దత కల్పించడం రాష్ట్ర ప్రజలందరి అదృష్టం అన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి, సంక్షేమం ఆగలేదని, నిత్యం ప్రజల కోసం పని చేసే నాయకుల పాలనలో ఉండటం మనందరి అదృష్టం అని అన్నారు. సీఎం కష్టంలో మనం పది శాతం పడినా 2029లో మళ్ళీ మనదే విజయం అని చెప్పారు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అమరావతి నిర్మాత , నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి ఏర్పడనుండటం చరిత్రాత్మక విషయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా వేదిక బహిరంగ సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.
దేశంలో రాజధానికి చట్టబద్ధత కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని, అందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇకపై ఎవరు వచ్చినా రాజధానిని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటన్నింటిని అధిగమించి అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తున్నారని కొనియాడారు. సీఎం గారు ఢిల్లీకి వస్తే ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండరని, నిత్యం కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు తెస్తుంటారన్నారు.
దేశంలో 4 వేలు, 6 వేలు పింఛన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు గారని, రాష్ట్రంలో నెలకు 64 లక్షల మంది పింఛనుదారులకు 2,800 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 3 లక్షల మందికి 131 కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. అలాగే అన్నదాత సుఖీభవ కింద మూడు విడతల్లో 20 వేలు దీపం -2 పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందజేస్తూ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సక్సెస్ చేశారని చెప్పారు. 30 ఏళ్లుగా వృధాగా పడి ఉన్న IFFCO కిసాన్ సెజ్ భూముల్లో ప్రస్తుతం 7-8 కంపెనీలు దాదాపు పది వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అన్నారు.
లక్ష కోట్ల బిపిసిఎల్ కంపెనీ, ఇండోసోల్ తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఉగాది కానుకగా 10060 ఉద్యోగాలతో జాబ్ క్యాలండర్ విడుదల చేసారని చెప్పారు. ఇలాంటి కూటమి ప్రభుత్వంలో పనిచేయడం తమకు చాలా సంతోషంగా ఉందని, సీఎం గారు పడే కష్టంలో 10 శాతం పడినా 2029లో మళ్ళీ మనదే విజయమని స్పష్టం చేశారు. పార్టీకి కార్యకర్తలే స్తంభాలని ఆయన కొనియాడారు.




