Amalapuram: దివ్యాంగ విద్యార్థులకు ‘సమగ్ర శిక్ష’ ఊతం.. ఉపకరణాలు పంచిన కలెక్టర్!

Amalapuram: డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్‌లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత సహాయక ఉపకరణాల పంపిణీ. 396 ఉపకరణాలను అందజేసిన కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Jun 2026 3:34 PM IST
Amalapuram
X

Amalapuram: దివ్యాంగ విద్యార్థులకు ‘సమగ్ర శిక్ష’ ఊతం.. ఉపకరణాలు పంచిన కలెక్టర్!

అమలాపురం: ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమాజంలో సమానత్వంతో ఆదరించి, వారి అభివృద్ధికి తోడ్పడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అన్నారు.

సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉచిత సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు ఉపకరణాలు అందజేశారు. అలింకో సంస్థ ద్వారా 6 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులకు జిల్లాలో మొత్తం 396 ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, హియరింగ్ ఎయిడ్స్, క్రచెస్, బ్రెయిలీ కిట్లు వంటి ఉపకరణాలు దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారి విద్యాభ్యాసానికి తోడ్పడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి పిల్లలో ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ జి. మమ్మీ, ఐఈసీ సభ్యులు ఎం.బి.బి. సత్యనారాయణ, ఏపీవో ఎం.ఏ.కే. భీమారావు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story