Amalapuram: ప్రజా అర్జీలపై కలెక్టర్ సీరియస్.. రీఓపెన్ అయితే చర్యలు తప్పవు!

Amalapuram: డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజల నుంచి వచ్చిన 210 అర్జీలపై కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జేసీ వైఖోమ్ నైదియాదేవి ప్రత్యేక ఆదేశాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Jun 2026 2:35 PM IST
Amalapuram
X

Amalapuram: ప్రజా అర్జీలపై కలెక్టర్ సీరియస్.. రీఓపెన్ అయితే చర్యలు తప్పవు!

అమలాపురం: ప్రజల నుంచి వచ్చే అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపించి, అవి తిరిగి రీఓపెన్ కాకుండా చూడాలని డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవితో కలిసి ప్రజల నుంచి సుమారు 210 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, "మన మిత్ర" యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులతో పాటు అన్ని అర్జీలకు శాశ్వత పరిష్కారాలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story