Palakollu: గోదావరి ప్రయాణికులకు ఊరట.. వశిష్ట నదిపై రాకపోకలు పునరుద్ధరణ

Palakollu: ఉభయగోదావరి జిల్లాల మధ్య వశిష్ట నదిపై నిర్మించిన దిండి – చించినాడ బ్రిడ్జి మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయి.

PRABHU, RAZOLE
Published on: 24 May 2026 2:09 PM IST
Palakollu
X

Palakollu: గోదావరి ప్రయాణికులకు ఊరట.. వశిష్ట నదిపై రాకపోకలు పునరుద్ధరణ

పాలకొల్లు: బ్రిడ్జి మరమ్మతులు దాదాపు పూర్తి కావొచ్చాయి. వచ్చే నెల జూన్ 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రాకపోకల పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. గత ఏడాది జూలైలో వంతెన మరమ్మత్తు పనులు ప్రారంభించగా.. వారధికి సంబంధించి 56 బేరింగులు దెబ్బతినడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గడ్డర్లు కూడా పాడయ్యాయి. ప్రస్తుతం వాటికి మరమ్మత్తులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ పనులు చివరి దశకు చేరుకోవడంతో జూన్ 10నుంచి వారధిని పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు జాతీయ రహదారి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది జూలై లో మొదలైన మరమ్మతు పనులు వల్ల, అప్పటి నుంచి తేలికపాటి వాహనాలకు మాత్రమే అనుమతి ఉండగా, భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పుడు మరమ్మత్తులు దాదాపు పూర్తికావడంతో ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు, వాహనదారులకు భారీ ఊరట లభించనుంది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story