Razole: రాజోలులో విజిలెన్స్ దాడులు: భారీగా రేషన్ బియ్యం సీజ్.. అక్రమార్కుడిపై కేసు!

Razole: డాక్టర్.బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు చేశారు. 4 క్వింటాళ్ల 25 కిలోల పీడీఎస్ బియ్యం సీజ్ వివరాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Jun 2026 3:37 PM IST
Razole
X

Razole: రాజోలులో విజిలెన్స్ దాడులు: భారీగా రేషన్ బియ్యం సీజ్.. అక్రమార్కుడిపై కేసు!

రాజోలు: డాక్టర్.బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం,ములికిపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని సోమవారం విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ములికిపల్లి గ్రామానికి చెందిన అడబాల సూర్యనారాయణ @ అబ్బు అనే వ్యక్తి కొంతకాలంగా లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు.

దాడుల్లో మొత్తం సుమారు 4 క్వింటాళ్ల 25 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచడంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పీడీఎస్ బియ్యాన్ని విక్రయించడం, నిల్వ ఉంచడం లేదా అక్రమంగా రవాణా చేయడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఈ దాడుల్లో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ ఆర్. శరత్, డిప్యూటీ తహసీల్దార్ (సివిల్ సప్లైస్) షేక్ ఇస్మాయిల్, వీఆర్వో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story