Daily Horoscope: రాశిఫలాలు - అద్భుతం అంటే ఇదే... అందరికీ సమాన అవకాశాలు

నవమి తిథి, ప్రీతి, ఆయుష్మాన్‌ యోగం కారణంగా పలు రాశుల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.

Balachander
Updated on: 9 Jun 2026 7:56 AM IST
Daily Horoscope: రాశిఫలాలు - అద్భుతం అంటే ఇదే... అందరికీ సమాన అవకాశాలు
X

Daily Horoscope: ఈరోజు అధిక జ్యేష్ఠమాసం బహుళపక్ష నవమి తిథి రాత్రి 2.34 వరకు ఆ తరువాత దశమి తిథి ప్రారంభమౌతుంది. అదేవిధంగా పూర్వాభాద్ర నక్షత్రం ఉదయం 9.39 వరకు ఉండి ఆ తరువాత ఉత్తరాభాద్ర ప్రారంభం అవుతుంది. ప్రీతియోగంతో పాటు ఆయుష్మాన్‌ యోగం కూడా ఉండటంతో పలు రాశుల వారి ఆరోగ్య జీవనంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రీతి, ఆయుష్మాన్‌ యోగం కారణంగా రాశుల్లో కలిగే మార్పులేంటో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారు ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న మొండిబాకీలు వసూలౌతాయి. కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులు తమ ప్రతిభను చాటుకుంటారు.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు చేపట్టిన కార్యక్రమాలు వేగంగా విజయవంతంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితం సుఖమయంగా సాగుతుంది. ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. అగ్రిమెంట్లు లాభిస్తాయి. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. సమస్యలను పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు అన్ని విధాలుగా కలిసివస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. సమస్యలు చాలా వరకు పరిష్కారమౌతాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారు చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలను అధికమిస్తారు. విద్యార్ధులు అంచనాలకు మించి చదువులో రాణిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన రోజు.

తులారాశి

ఈరోజు ఈరాశివారు ఆశించిన ఆదాయం సమకూరుతుంది. రుణాల నుంచి విముక్తి పొందుతారు. నూతన సంస్థల్లో సభ్యత్వాలు పొందుతారు. సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. సమస్యల నుంచి బయటపడతారు. నూతన భవనాల నిర్మాణం చేపడతారు. సహచరుల సహకారంతో కీలక పనులను పూర్తిచేస్తారు.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారు కీలకంగా భావించిన అదనపు ఆదాయం లభిస్తుంది. కుటుంబంలో ప్రేమాభిమానాలు చొరగొంటారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు.

ధనూరాశి

ఈరోజు ఈరాశివారు కొన్ని అవసరాల కోసం రుణాలు తీసుకోవలసి వస్తుంది. నిరుద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి.

మకరరాశి

ఈరోజు ఈరాశివారు అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నూతన అవకాశాలు ఉన్నాయి. ఉపాధి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. గతంలో మీకు అవరోధంగా ఉన్న కొన్ని పనులు పూర్తి చేస్తారు. అయితే ఆదాయం పెరిగినా దానికి అనుగుణంగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతన పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు

మీనరాశి

ఈరోజు ఈరాశివారు నూతన అగ్రిమెంట్లు చేసుకునేందుకు ఆసక్తికనబరుస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కొంత మంది వ్యక్తుల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని నిర్ణయాలను మార్చుకోవలసి వస్తుంది. గుర్తింపు లభిస్తుంది.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి పూర్తి జాతక ఫలితాలు కావాలంటే నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story