ఇప్పుడు బుక్ చేస్తే సంవత్సరం వెయిట్ చేయాల్సిందే.. అయినా తగ్గని క్రేజ్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న SUV!

Mahindra Thar Roxx: మార్కెట్లోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏకంగా 1 లక్ష అమ్మకాల మైలురాయిని దాటి ఈ కారు సరికొత్త రికార్డు సృష్టించింది.

Venkat
Published on: 24 May 2026 9:43 AM IST
Mahindra Thar Roxx
X

ఇప్పుడు బుక్ చేస్తే సంవత్సరం వెయిట్ చేయాల్సిందే.. అయినా తగ్గని క్రేజ్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న SUV!

Mahindra Thar Roxx Waiting Period: భారతీయ ఆటోమొబైల్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది. ఈ కారును సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు గంటున్నారు. షోరూమ్‌కు వెళ్లి బుక్ చేసుకుంటే.. ఏకంగా ఏడాది తర్వాత గానీ తాళాలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. అయినా సరే, తగ్గేదే లేదంటూ వాహన ప్రియులు క్యూ కడుతున్నారు. దేశంలో ఆ కారుకు ఉన్న క్రేజ్ ఇప్పుడు పీక్స్‌కు చేరింది.

బుక్ చేస్తే ఏడాది తర్వాతే డెలివరీ.. దేశవ్యాప్తంగా థార్ రాక్స్ హవా..!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీ (SUV) కార్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించే రఫ్ అండ్ టఫ్ లుక్, అడ్వెంచర్లకు అనుకూలంగా ఉండే ఆఫ్‌రోడింగ్ సామర్థ్యం ఉన్న వాహనాల కోసం యువతతో పాటు కుటుంబాలు కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటాయి. ఈ విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ తీసుకొచ్చిన 'థార్' భారత మార్కెట్‌లో ఒక సంచలనంగా మారింది. మొదట్లో కేవలం అడ్వెంచర్ ప్రేమికులను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ వాహనం, క్రమంగా సాధారణ కుటుంబాలను సైతం అమితంగా ఆకట్టుకుంది.

అయితే, పాత మూడు డోర్ల థార్‌లో స్థలం తక్కువగా ఉండటం, వెనుక సీట్లలో కూర్చోవడం కుటుంబ సభ్యులకు కొంత అసౌకర్యంగా మారడంతో మహీంద్రా సంస్థ వినియోగదారుల నాడిని పట్టుకుంది. అందుకోసమే మరింత విశాలంగా, ఐదు డోర్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'థార్ రాక్స్' (Thar Roxx)ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఒక్క మార్పు కారు రూపురేఖలనే కాదు, అమ్మకాల రికార్డులను కూడా మార్చేసింది.

రికార్డుల వేట: ఏడాదిలోనే లక్ష మార్కు దాటిన అమ్మకాలు..

ఐదు డోర్ల ఆకర్షణీయమైన రూపంతో, ఆధునిక సదుపాయాలతో వచ్చిన ఈ సరికొత్త ఎస్‌యూవీ విడుదలైన మొదటి రోజు నుంచే బుకింగ్స్ సునామీ సృష్టించింది. థార్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌ను అలాగే కాపాడుకుంటూనే, కుటుంబ ప్రయాణాలకు అనుకూలమైన ప్రీమియం ఫీచర్లను జోడించడంతో జనాలు షోరూమ్‌లకు పరుగులు తీశారు. మార్కెట్లోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏకంగా 1 లక్ష అమ్మకాల మైలురాయిని దాటి ఈ కారు సరికొత్త రికార్డు సృష్టించింది. 2026లో కూడా ఈ కారు డిమాండ్ ఏమాత్రం తగ్గకపోగా, రోజురోజుకూ మరింత పుంజుకుంటోంది.

336 రోజుల వెయిటింగ్ పీరియడ్.. ఏ నగరంలో ఎలా ఉందంటే?

ప్రస్తుతం ఈ కారుకు ఉన్న డిమాండ్ కారణంగా కొన్ని వేరియంట్లకు భారీ స్థాయిలో వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. అత్యధికంగా డిమాండ్ ఉన్న ట్రిమ్స్ కోసం వినియోగదారులు దాదాపు 336 రోజులు, అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు నిరీక్షించాల్సి వస్తోంది. మరికొన్ని సాధారణ వేరియంట్లకు కనీసం 28 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వెయిటింగ్ పీరియడ్ వివరాలు ఇలా ఉన్నాయి:

గుర్గావ్, ఫరీదాబాద్, నోయిడా: ఈ ప్రాంతాల్లో థార్ రాక్స్ 2.0 MX1 ట్రిమ్‌కు అత్యధికంగా 336 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.

బెంగళూరు: ఇక్కడ ఇదే వేరియంట్ కోసం వాహన ప్రియులు 120 రోజుల పాటు వేచి చూడక తప్పడం లేదు.

హైదరాబాద్: భాగ్యనగరంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఇక్కడ సాధారణ వేరియంట్లకు 42 రోజుల వెయిటింగ్ మాత్రమే ఉంది. అయితే, ప్రత్యేకమైన డీజిల్, ఆటోమేటిక్ ట్రిమ్స్ (ఉదాహరణకు 2.2 MX5 AT డీజిల్, స్టార్ ఎడిషన్ డీజిల్) వంటి మోడళ్లకు మాత్రం కనీసం 90 రోజుల సమయం పడుతోంది.

డెలివరీ సమయాన్ని శాసించే అంశాలు ఇవే..!

ఈ డెలివరీ సమయాలు అనేవి దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఒకేలా ఉండవు. వినియోగదారులు ఎంచుకునే రంగు, పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్ ఆప్షన్, ఆటోమేటిక్ లేదా మాన్యువల్ గేర్‌బాక్స్ వంటి అంశాలపై వెయిటింగ్ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు మీరు ఏ డీలర్‌షిప్ వద్ద బుక్ చేసుకుంటున్నారు, ఆయా షోరూమ్‌లలో ఉన్న స్టాక్ లభ్యతను బట్టి ఈ సమయాల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు.

సరికొత్త సాంకేతికత, కుటుంబానికి సరిపడేలా ఉన్న లగ్జరీ ఫీచర్లు మహీంద్రా థార్ రాక్స్‌ను ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో రారాజుగా నిలబెట్టాయి. ఒక కారు కోసం ఏడాది పాటు ఎదురుచూడటం అంటే సామాన్యమైన విషయం కాదు, కానీ థార్ రాక్స్ ఇచ్చే రాయల్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం ఆ మాత్రం నిరీక్షణ తప్పదని వాహన ప్రియులు భావిస్తున్నారు. మీ నగరంలో ఖచ్చితమైన డెలివరీ సమయం తెలుసుకోవడానికి సమీపంలోని మహీంద్రా షోరూమ్‌ను సంప్రదించవచ్చు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story