Madanapalle: చెక్‌పోస్ట్ వద్ద డ్యూటీలో ఉండగానే కుప్పకూలిన కానిస్టేబుల్.. మదనపల్లెలో విషాదం!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె రామసముద్రం చెక్‌పోస్ట్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ రెడ్డయ్య (35) ఆకస్మికంగా మృతి చెందారు.

Srinivasulu, Madanapalle
Published on: 24 May 2026 1:50 PM IST
Madanapalle
X

Madanapalle: చెక్‌పోస్ట్ వద్ద డ్యూటీలో ఉండగానే కుప్పకూలిన కానిస్టేబుల్.. మదనపల్లెలో విషాదం!

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందడం విషాదాన్ని నింపింది. రామసముద్రం చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రెడ్డయ్య (35) ఆదివారం అస్వస్థతకు గురికాగా, చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఎక్సైజ్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచర ఉద్యోగులు, స్థానికులు రెడ్డయ్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story