Unguturu: ఉంగుటూరులో వైసీపీ ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన: నల్ల బెలూన్లు ఎగరేసి పుప్పాల వాసుబాబు వినూత్న నిరసన!

Unguturu: ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం జరిగింది.

Arun Chilukuri
Published on: 9 Jun 2026 9:48 PM IST
Unguturu
X

Unguturu: ఉంగుటూరులో వైసీపీ ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన: నల్ల బెలూన్లు ఎగరేసి పుప్పాల వాసుబాబు వినూత్న నిరసన!

ఉంగుటూరు: ఉంగుటూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు - వైస్సార్సీపీ PAC సభ్యులు పుప్పాల వాసుబాబు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు "వెన్నుపోటుకు రెండేళ్లు "నిరసన కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తెలియచేస్తూ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉంగుటూరు గ్రామంలో కమ్మ కళ్యాణ మండపం నందు టౌన్ హాల్ సమావేశం ఏర్పాటు చేయడమైనది.

ఈ కార్యక్రమంలో ఈ రెండేళ్లలో జరిగిన కుటమి ప్రభుత్వం వైఫల్యాలను అగాత్యాలను నిరసనంగా బ్లాక్ బెలూన్స్ ఎగరవేయడం జరిగింది. మీటింగ్ హాల్ ఎంట్రన్స్ లో ఏర్పాటుచేసి ఫోటో గ్యాలరీ కార్యకర్తల తో కలిసి పరిశీలించడం జరిగింది.

పుప్పాల వాసుబాబు గారు మాట్లాడుతూ ఈ రెండేళ్లు లక్షla కోట్లు అప్పు చేయడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. ఈ నాయకులు విచ్చలవిడిగా ప్రైవేట్ ఫైట్లు తిరిగి ప్రభుత్వానిక భారంగా మారి ప్రజల్ని కి పొదుపు మంత్రాలతో నీతులు చెబుతున్నారని ఆయన అన్నారు.

జాబు క్యాలెండర్లు ప్రకటించామని చెప్పుకుని డీఎస్సీలో పోస్టులు యువగళం పని చేసిన యువకులకు దొంగ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ తో స్పోర్ట్స్ కోటలో పేకాట సర్టిఫికెట్స్ తో జాబులు కేటాయించారని కేటాయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేయడమైనది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story