Chirala: చీరాలలో మెడికల్ షాపుల బంద్ తహశీల్దార్‌కు కెమిస్టుల వినతిపత్రం
Chirala: ఆన్‌లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా చీరాల పట్టణంలో మెడికల్ షాపులు పూర్తిగా బంద్ అయ్యాయి.
Chirala: చీరాలలో మెడికల్ షాపుల బంద్ తహశీల్దార్‌కు కెమిస్టుల వినతిపత్రం
చీరాల: పట్టణంలోని మెడికల్ షాపుల యజమానులు బుధవారం బందు పాటించారు. ఔషధ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ మెడికల్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు మెడికల్ షాపుల నిర్వాహకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుండి గడియార స్తంభం సెంటర్ తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
కోవిడ్ సమయంలో ఆన్లైన్ మెడికల్ విక్రయాలకు అనుకూలంగా ఇచ్చిన జీవోలు విజయాలని, గడువు దాటిన మందులను ఆన్లైన్లో అక్రమంగా విక్రయించడానికి నిరోధించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న ఔషధ దుకాణాల నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ర్యాలీ అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ర్యాలీలో మెడికల్ షాపుల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
Next Story




