Parchur: బీసీ కాలనీలకు గుడ్ న్యూస్ కమ్యూనిటీ హాళ్ల మంజూరుకు మంత్రి హామీ
Parchur: పర్చూరు నియోజకవర్గంలో 57 కొత్త బీసీ కమ్యూనిటీ హాళ్ల మంజూరు కోసం మంత్రి సవితమ్మను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కలిశారు.
Parchur: బీసీ కాలనీలకు గుడ్ న్యూస్ కమ్యూనిటీ హాళ్ల మంజూరుకు మంత్రి హామీ
పర్చూరు: బీసీ వర్గాల అభ్యున్నతికి మౌలిక వసతుల కల్పనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మతో ఏలూరి సాంబశివరావు భేటీ అయ్యారు. మంగళవారం తాడేపల్లిలోనే మంత్రి క్యాంప్ కార్యాలయంలో మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో ఎమ్మెల్యే ఏలూరి మంత్రిని కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానంగా బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ అవసరాన్ని వివరించారు. పర్చూరు నియోజకవర్గంలో మార్టూరు, చిన్నగంజాం, ఇంకొల్లు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు మండలాలు ఉన్నాయని, అధిక సంఖ్యలో బీసీ కాలనీలు ఉన్నాయని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు.
ఆయా వర్గాల ప్రజలు ప్రధానంగా వ్యవసాయ కూలీలు, సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించేందుకు తగిన భవనాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా 57 బీసీ కమ్యూనిటీ హాళ్లు అవసరమని ప్రతిపాదనలు అందజేశారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి సవితమ్మ ప్రజల అవసరాల దృష్ట్యా కమ్యూనిటీ హాళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీసీ వర్గాలకు సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలకు శాశ్వత వేదికలు నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, బీసీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం వద్ద నిరంతరం కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు.
మండలాల వారిగా ప్రతిపాదనలు...
•మార్టూరు మండలంలో రాజుపాలెం1, బొబ్బేపల్లి 2, బొల్లాపల్లి 6, కొలాలపూడి 1, జొన్నతాళి 1, ఇసుక దర్శి1, ద్రోణాదుల1, తాటివారిపాలెం 2 గ్రామాలకు కమ్యూనిటీ హాళ్ల ప్రతిపాదనలు ఇచ్చారు.
•కారంచేడు మండలంలోని కుంకలమర్రు 1, కారంచేడు 4, జరుబులవారిపాలెం1, స్వర్ణ 1 గ్రామాలు జాబితాలో ఉన్నాయి.
•ఇంకొల్లు మండలంలో వంకాయలపాడు 1, ఇడుపులపాడు1, పుసపాడు2, భీమవరం1, దుద్దుకూరు1, ఇంకొల్లు1, నాగండ్ల 1, కమ్యూనిటీ హాల్స్ ప్రతిపాదించారు .
•పర్చూరు మండలంలోని ఉప్పుటూరు1, పర్చూరు1, చెరుకూరు2, తన్నీరువారిపాలెం1, దేవరపల్లి1, నూతలపాడు 1, కమ్యూనిటీ హాల్స్ ప్రతిపాదించారు.
•చిన్నగంజాం మండలంలో గోనసపూడి 1, కడవకుదురు1, పెదగంజాం1, రాజుబంగారుపాలెం2, పెద్దపల్లెపాలెం1, మోటు పల్లి 1, అడవీధిపాలెం 4, కొత్తపాలెం 1, కొడురీవారిపాలెం1, కొత్తగొల్లపాలెం 1,అవుల దొడ్డి కొత్త గొల్లపాలెం 1,కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
•యద్దనపూడి మండలంలోని , సూరవారిపాలెం1, యనమండల1, జాగర్లమూడి1, తానుబొదివారిపాలెం1, శ్యామలవారిపాలెం 1 కమ్యూనిటీ హాల్స్ ఎమ్మెల్యే ఏలూరి ప్రతిపాదించారు.




