Bapatla: ఓటు నమోదుకు సిద్ధం కండి.. ఎమ్మెల్యే మద్దులూరి కీలక పిలుపు!

Bapatla: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర పునఃపరిశీలన కార్యక్రమంపై ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కీలక సూచనలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Jun 2026 8:11 AM IST
Bapatla
X

Bapatla: ఓటు నమోదుకు సిద్ధం కండి.. ఎమ్మెల్యే మద్దులూరి కీలక పిలుపు!

Bapatla: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునఃపరిశీలన (SIR) కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పిలుపునిచ్చారు.

24 సంవత్సరాల తర్వాత భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాల సమగ్ర పునఃపరిశీలన చేపడుతోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పులు లేని సమగ్ర ఓటరు జాబితాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని, ఈ ప్రక్రియలో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి ఓట్ల తొలగింపు వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఓటరు జాబితాలను బీఎల్ఓలతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని కోరారు.

జూలై 21న ముసాయిదా ఓటరు జాబితాలు విడుదల కానున్నాయని, ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని, సెప్టెంబర్ 22న తుది జాబితాలు ప్రకటిస్తారని తెలిపారు.

ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అందరూ సమష్టిగా కృషి చేయాలని నాయకులు కార్యకర్తలు బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story